ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

ABN, Publish Date - Sep 20 , 2024 | 02:30 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న టీటీడీ అధికారులు

తిరుమల, సెప్టెంబరు19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో జిల్లా.. టీటీడీ అధికారులు, ఇతర శాఖలతో సమావేశం నిర్వహించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్‌, జిల్లా యంత్రాంగం నుంచి ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య, ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గత రెండేళ్లుగా వాహనాల రాకపోకలు పెరగడంతో తిరుమలలో పార్కింగ్‌ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడానికి తగిన సంఖ్యలో బస్సులు నడపాలి.

అలిపిరి లింక్‌ బస్టాండ్‌, మున్సిపల్‌ గ్రౌండ్స్‌, వినాయకసాగర్‌ క్వార్టర్స్‌లో ద్విచక్రవాహనాలు.. భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌లో ప్రైవేట్‌ జీపులు, కార్లు సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలు.. ఎస్వీ జూపార్క్‌ పక్కనే ఉన్న దేవలోక్‌లో ప్రైవేట్‌ బస్సుల కోసం పార్కింగ్‌ ఏర్పాటు.

చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్‌ ట్యాగింగ్‌ ఏర్పాటు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు లగేజీ సెంటర్‌ను సేవాసదన్‌1, 2 ఎదురుగా మార్పు.

నాలుగుమాడవీధుల్లో భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం. యాత్రికుల కోసం మరిన్ని ‘మే ఐ హెల్ప్‌ యూ’ సమాచార కేంద్రాల ఏర్పాటు.

వైద్య శిబిరాలకోసం స్విమ్స్‌, రుయా, బర్డ్‌ నుంచి అదనపు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకోవడం.

తిరుమలలో మెరుగైన పారిశుధ్య పనులు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమన్వయంతో నగరంలోనూ పారిశుధ్య పనుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలి.

Updated Date - Sep 20 , 2024 | 02:30 AM