AP Politics: పుంగనూరులో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల రాళ్ల దాడి..
ABN, Publish Date - Jul 18 , 2024 | 01:23 PM
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మిథున్ రెడ్డి పుంగనూరు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కూటమి శ్రేణులు రెడ్డప్ప ఇంటికి భారీగా చేరుకున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు సైతం రెడ్డప్ప ఇంటికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
మరోవైపు వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులపై రాళ్లు రువ్వడంతో 9 మంది టీడీపీ నాయకులకు గాయాలయ్యారు. వైసీపీ నేతలు రాళ్లతో దాడి చేయడంతో టీడీపీ శ్రేణులు సైతం ఎదురుదాడికి దిగడంతో వైసీపీకి చెందిన ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతల రాళ్ల దాడిలో ఇద్దరు మీడియ ప్రతినిధులకు గాయాలయ్యాయి.
Ayyanna Patrudu: జగన్ కట్టించిన గోడ.. స్పీకర్ ఏం చేశారంటే..
పోలీసుల భద్రతలో మిథున్ రెడ్డి..
మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఈక్రమంలో టీడీపీ కూటమి నేతలు రెడ్డప్ప ఇంటికి చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డప్ప ఇంటి నుంచి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ శ్రేణుల రాళ్లదాడిలో గాయపడిన పలువురు టిడిపి కార్యకర్తలు, నాయకులకు స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిద్దరిని తిరుపతి సిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు.
Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..
టార్గెట్ టీడీపీ..
వైసీపీ నేతలు ఉద్దేశపూర్తకంగా తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దాడిని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేయడం ద్వారా శాంతిభద్రతల సమస్యల తలెత్తేలా వైసీపీ కుట్ర చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారం భవనం పైనుంచి వైసిపి నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేసినట్లు అనుమానం.
ముందస్తు సమాచారం లేకుండా..
ముందస్తు సమాచారం లేకుండా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు రావడంతో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోవడంతో ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మిథున్ రెడ్డి వస్తున్న విషయం తెలియడంతో కొందరు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో వైసీపీ శ్రేణులు రాళ్లు విసరడంతో అసలు గొడవ మొదలైంది. మొదట వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వడంతో.. విషయం పార్టీ శ్రేణులకు తెలపడంతో భారీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Viveka Case: వివేక హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై విచారణ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jul 18 , 2024 | 04:08 PM