ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tirupati Gangamma Jatara: 900 ఏళ్ల చరిత్ర.. రోజుకో వేషధారణ.. ఈ జాతర ప్రత్యేకతలెన్నో..

ABN, Publish Date - May 15 , 2024 | 09:09 PM

శ్రీ తాతయ్య గుంట ‘‘గంగమ్మ జాతర’’ ఈరోజు (బుధవారం) ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరలో బైరాగి వేషంలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నది. నేటి నుంచి రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

Tirupati Gangamma Jatara

తిరుపతి: శ్రీ తాతయ్య గుంట ‘‘గంగమ్మ జాతర’’ ఈరోజు (బుధవారం) ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరలో బైరాగి వేషంలో భక్తులు గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నది. నేటి నుంచి రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

గంగమ్మ జాతరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈజాతరకు 900 ఏళ్ల చర్రిత ఉంది. ప్రతీ ఏడాది మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. నిన్న(మంగళవారం) అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. అయితే ఈ జాతరను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.


ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తున్నారు. 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఏడు రోజుల పాటు వివిధ వేషాల్లో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు.

ఈ జాతరతో తిరుపతి పుర వీధులన్నీ గంగమ్మ పునకాలతో హోరెత్తుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే.. ఈ జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లకూడదని విశ్వసిస్తారు. కాగా ఇటీవల విడుదలైన పుష్ప- 2 సినిమా టీజర్‌‌లోనూ సినీ నటుడు అల్లు అర్జున్ స్త్రీ వేషధారణలో కనిపించిన విషయం తెలిసిందే. గంగమ్మ జాతరకు సంబంధించిన కొన్ని సీన్లనూ కూడా ఈ సినిమాలో చిత్రీకరించినట్లు సమాచారం.

Updated Date - May 15 , 2024 | 09:32 PM

Advertising
Advertising