YCP: తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ హవా!
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:01 AM
చౌడేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు గోవిందు రికార్డులు రాస్తుండడం సోమవారం గమనించారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప .
చౌడేపల్లె, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : చౌడేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ హవా నడుస్తోంది. రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప సోమవారం తన కుమారులకు బర్త్ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే వైసీపీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు గోవిందు అక్కడ రికార్డులు రాస్తుండడం గమనించారు. రెడ్డెప్పతో పాటు టీడీపీ కార్యకర్తలు బీర్జేపల్లె రెడ్డెప్ప, సుధాకర్ కలసి ఆఫీస్ రికార్డులు రాయడానికి ఏమి హక్కు ఉందంటూ గోవిందు వద్ద రికార్డులు తీసుకున్నారు. అయితే అక్కడేవున్న 29ఏ చింతమాకులపల్లె వీఆర్వో రెడ్డెప్ప తానే రికార్డులు రాయమన్నానంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. ఈలోపు గోవిందు అక్కడినుంచి వెళ్ళిపోవడంతో డీటీ మాధవిని వివరణ కోరారు. తమకు తెలియకుండా కొందరు వీఆర్వోలు ఇలా చేస్తున్నారన్న ఆమె ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ వలంటీర్లు కొంతమంది కూడా రెవెన్యూ కార్యాలయంలో దందాలు నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.
Updated Date - Dec 24 , 2024 | 01:01 AM