ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

ABN, Publish Date - Oct 25 , 2024 | 05:26 AM

అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

  • అమరావతి రైల్వే లైన్‌ను మూడేళ్లలో పూర్తి చేయండి: బాబు

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌....గురువారం ఆన్‌లైన్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, బీజేపీ ఎంపీ, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరితో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి రైలుమార్గం కోసం అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అశ్వినీ వైష్ణవ్‌కు హామీఇచ్చారు. ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్లు కూడా జారీ చేశామన్నారు. దీని దృష్ట్యా ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేయగలిగితే అందరికీ మేలు జరుగుతుందని చంద్రబాబు సూచించారు.

అలానే నవంబరు/డిసెంబరు నెలల్లో ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రిని హాజరయ్యేలా చూడాలని కేంద్ర రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు. రాజధానికి రైల్వే కనెక్టివిటీ వల్ల దేశంలోని అన్నీ రాజధానులను అనుసంధానం చేసేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి అన్ని విధాలా సహకరించిందని ఎంపీ పురందేశ్వరి అన్నారు. అమరావతికి కనెక్టివిటీ పెంచడం ద్వారా ఇక్కడ ఆర్థిక వృద్ధికి అవకాశాలు పెరుగుతాయని ఆమె అన్నారు.

‘‘10 రోజుల కిందటే ఢిల్లీలో పర్యటించినప్పుడు అమరావతి రైల్వే అనుసంధానం గురించి ప్రధాని మోదీతో మాట్లాడాను. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రతిపాదనను ఆమోదించడం హర్షణీయం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం’’

- సీఎం చంద్రబాబు

Updated Date - Oct 25 , 2024 | 05:26 AM