ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : తడిసిన ధాన్యం కొనాలి

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:12 AM

ఫెంగల్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలకు సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

  • ఫెంగల్‌ తుఫానుపై సమీక్షలో సీఎం ఆదేశాలు

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఫెంగల్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలకు సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వర్షం కారణంగా తడిసిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం, ప్రభుత్వ సహాయ చర్యలపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష జరిపారు. సీఎస్‌ నీరబ్‌కుమార్‌ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 53 మండలాల్లో తుఫాను ప్రభావం ఉందని, భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 6,824 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు.

  • అప్రమత్తత అవసరం: మంత్రి అనిత

ఫెంగల్‌ తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆమె ఫోన్‌లో మాట్లాడి, తాజా పరిస్థితులను ఆరా తీశారు.

Updated Date - Dec 03 , 2024 | 05:12 AM