ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:05 PM

వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ముప్పు తప్పింది. జస్ట్ మూడు అడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోవడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

CM Chandrababu Naidu

విజయవాడ, సెప్టెంబర్ 05: వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ముప్పు తప్పింది. జస్ట్ మూడు అడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోవడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.


భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వీడలేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బుడమేరు వరద ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు ముధరా నగర్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు.


అదే సమయంలో ట్రాక్‌పై నుంచి ట్రైన్ వస్తోంది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. ట్రైన్ వస్తోందని, అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు. మరోవైపు విషయాన్ని గమనించిన చంద్రదండు కార్యకర్తలు.. లైన్‌మెన్‌ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్‌కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ స్లో అయ్యింది. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ సరౌండ్ అయ్యారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు కూడా చంద్రబాబు వెన్నంటి ఉన్నారు. ట్రైన్ సరిగ్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


Also Read:

జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!

బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే..!

అలర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 05 , 2024 | 04:07 PM

Advertising
Advertising