ఏసుక్రీస్తు యుగకర్త: సీఎం బాబు
ABN, Publish Date - Dec 25 , 2024 | 07:06 AM
సర్వమానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సర్వమానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రేమ మార్గంలో ఎవరి మనసునై నా జయించవచ్చని నిరూపించిన క్రీస్తు మార్గంలో నడు స్తూ, ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని, సర్వమానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్ధిద్దాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 07:06 AM