CM Chandrababu : ‘మిషన్ కర్మయోగి’తో నైపుణ్యాల పెంపు
ABN, Publish Date - Dec 25 , 2024 | 06:45 AM
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిర్దేశించిన ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
కెపాసిటీ బిల్డింగ్ పాలసీకి సీఎం ఆమోదం
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నిర్దేశించిన ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ శిక్షణ కోసం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో ఒప్పందం చేసుకుంది. కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. ఆధునిక సాంకేతికతతో నడిచే కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా ఉద్యోగులు, యువత నైపుణ్యాలు పెంచుకోవడం అత్యవసరమని, ఇందుకోసం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిఫారసు చేసిన శిక్షణ పాలసీని ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. పోలీస్, రెవెన్యూ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా, ఆరోగ్య రంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని ఉపయోగిస్తామన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 06:45 AM