ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: డికోడర్ ఇంటర్వ్యూలో ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్

ABN, Publish Date - May 28 , 2024 | 08:22 AM

పోలింగ్‌కు ముందు డికోడర్ ఛానల్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం

అమరావతి: పోలింగ్‌కు ముందు డికోడర్ ఛానల్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం.

జగన్: మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చెప్పాలంటే 4 పోర్టులు నిర్మిస్తున్నాం.

వాస్తవం: గడచిన 5 ఏళ్లుగా చెపుతున్న మాట ఇది. అయితే ఆ పోర్టుల్లో ఏ స్థాయిలో నిర్మాణం జరుగుతుందనేది మాత్రం చెప్పరు.

జగన్: 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం

వాస్తవం: అప్పటికే ఉన్న కళాశాలలు మినహా కొత్తగా పూర్తి చేసిన వాటి వివరాలు జగన్ వెల్లడించలేదు. విభజన హామీలలో వచ్చిన వాటిని తన ఘనతగా గొప్పలు చెబుతున్న జగన్.

జగన్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం.

వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వం ఉన్న కాలానికి వచ్చిన అవార్డులు, రివార్డులు తన ఖాతాలో సీఎం వేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వమే నంబర్ 1 అయితే ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి కొత్తగా ఉపాధి లభించింది ఎందుకు చెప్పరు?

జగన్: మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు.

వాస్తవం: ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టీడీపీ హయాంలో మోడల్ స్కూళ్ల రూపంలో ప్రారంభమయ్యాయి. జగన్ సీఎం అయ్యాక రేషనలైజేషన్ పేరుతో పల్లెకు పాఠశాలలు దూరమయ్యాయి. తద్వారా డ్రాప్ ఔట్స్ పెరిగాయి. ప్రాథమిక విద్యలో ఈ సంఖ్య మరింత ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి.

జగన్: 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.

వాస్తవం: రాజధాని అమరావతి కోసం ఇచ్చిన భూములను లాక్కొని వైసీపీ కార్యకర్తలకు ఇవ్వాలని జగన్ చూడగా.. రైతులు న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా కేటాయింపులు ఉన్నా .. అక్కడ కాకుండా ఆర్ ఫై జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించి మాస్టర్ ప్లాన్లు దెబ్బతీసే కుట్రను రైతులు భగ్నం చేశారు. ఆర్ ఫై జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా అమరావతి సాకారం కాకుండా నిర్వీర్యం చేయడమే జగన్ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన టిడ్కో ఇళ్లను ఏళ్ల తరబడి పేదలకు ఇవ్వకుండా సెంట్ స్థలాల పేరుతో తాత్సారం. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదల కోసం నిర్మించిన 5024 టిడ్కొ ఇళ్లను నేటికీ జగన్ సర్కార్ అప్పగించలేదు. 90 శాతం పనులు పూర్తయిన పేదలకు ఇళ్ళను జగన్ ఇవ్వలేదు.

జగన్: అమరావతి విజయవాడకు.. గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వాస్తవం: విజయవాడ గుంటూరులో ఉండే వారికి 40 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వాలనుకున్నారో జగన్ వివరించలేదు.

జగన్: గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేలా 15 వేలకు పైగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. విలేజ్ క్లినిక్ నిర్మించాం. అలాగే గ్రామాల్లో రైతులకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.

వాస్తవం: గ్రామ సచివాలయాలను ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ సమయంలో రాజకీయ ప్రయోజనాలకు, ఎత్తుగడలను వాటిని కేంద్రాలుగా జగన్ సర్కార్ మార్చేసింది.

జగన్: నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టాం.

వాస్తవం: బోధనా సిబ్బందికి యాప్‌ల పేరుతో వేధింపులకు పాల్పడింది. దీంతొ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. పాఠశాలల రేష్నలైజేషన్ పేరుతో బడిని గ్రామానికి జగన్ సర్కార్ దూరం చేసింది.

Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

Read more AP News and Telugu News

Updated Date - May 28 , 2024 | 08:22 AM

Advertising
Advertising