ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: సీఎం రమేశ్ కీలక ప్రకటన.. మనసులో మాట వెల్లడి

ABN, Publish Date - Mar 11 , 2024 | 03:31 PM

ఏపీ బీజేపీ కీలక నేత సీఎం రమేశ్ మనసులో మాటను బయటపెట్టారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠానానికి తన ప్రతిపాదనను విన్నవించానని, సమీకరణాలు బట్టి సాధ్యం కాకుంటే పార్టీ ఎక్కడ ఆదేశించినా పోటీకి సిద్ధమని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ప్రధాని మోదీ పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

విజయవాడ: ఏపీ బీజేపీ (AP BJP) కీలక నేత సీఎం రమేశ్ (CM Ramesh) మనసులో మాటను బయటపెట్టారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠానానికి తన ప్రతిపాదనను విన్నవించానని, సమీకరణాలు బట్టి సాధ్యం కాకుంటే పార్టీ ఎక్కడ ఆదేశించినా పోటీకి సిద్ధమని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ప్రధాని మోదీ (PM Narendra Modi) పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మోదీ సారధ్యంలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) రాక్షస పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.

నిన్న (ఆదివారం) ‘సిద్ధం’ (Siddam) సభలో కూడా జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని సీఎం రమేశ్ విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని అసత్యాలు ప్రచారం చేయడం బాగా నేర్చుకున్నాడని మండిపడ్డారు. అవాస్తవాలను వాస్తవాలుగా చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని సీఎం రమేశ్ దీమా వ్యక్తం చేశారు. కూటమి విజయంతో ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

Chandrababu: చంద్రబాబు నివాసానికి పవన్.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 03:36 PM

Advertising
Advertising