ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను సిఫార్సు చేసిన సుప్రీం కొలిజీయం

ABN, Publish Date - Oct 15 , 2024 | 08:18 PM

ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. అందులో పలు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ క్రమంలో 2024, మే 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించారు. దాంతో ఈ ముగ్గురు సీనియర్ న్యాయవాదుల పేర్లు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలిజీయం మంగళవారం వారి నియామకాల కోసం సిఫార్సు చేసింది. న్యాయవాదులు కుంచెం మహేశ్వరరావు, తోట చంద్ర ధన శేఖర్, చల్లా గుణరంజన్‌లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్స్ చేసింది.

Also Read: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు

Also Read: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. అందులో పలు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ క్రమంలో 2024, మే 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించారు. దాంతో ఈ ముగ్గురు సీనియర్ న్యాయవాదుల పేర్లు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు.

Also Read: బుధవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం

Also Read: Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ఈ సిఫార్సులోని అంశాలను సుప్రీంకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే అందుకు సంబంధించిన సిఫార్సు దస్రాన్ని న్యాయ శాఖ పరిశీలించింది. అనంతరం ఆ దస్త్రాన్ని సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ఆ తర్వాత ఈ ముగ్గురు ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 26 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. ఈ కొలిజీయంకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వాన్ని వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?

Also Read: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Oct 15 , 2024 | 08:18 PM