మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక సూచనలు

ABN, Publish Date - Apr 01 , 2024 | 07:25 PM

పింఛన్ల పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. సోమవారం నాడు కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీపై రివైజ్డ్ మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు.

AP News: పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక సూచనలు

అమరావతి: పింఛన్ల పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం పలు కీలక సూచనలు జారీ చేసింది. సోమవారం నాడు కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీపై రివైజ్డ్ మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు. పింఛన్ల పంపిణీపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎస్ తీసుకున్నారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చని సూచించారు.

Big Breaking: నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు.. పవన్ సంచలన కామెంట్స్


వారంలో పింఛన్లు పంపిణీ చేయొచ్చని పలువురు కలెక్టర్లు సీఎస్‌కు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీకి ఇబ్బంది లేదని అన్నారు. నగరాలు, పట్టణాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేస్తే సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ రాత్రికి పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

వేసవిపై జాగ్రత్తలు

వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను ఉదయం 10.30 గంటలలోపు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో తగిన నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని తాగనీటి చెరువులు నింపేందుకు ఈనెల 4వ తేదీన ప్రకాశం బ్యారేజి ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 8వ తేదీన నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. మంచి నీటిని తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 08:27 PM

Advertising
Advertising