ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP-JSP First List: గెలుపు గుర్రాలతో సై..

ABN, Publish Date - Feb 25 , 2024 | 03:54 AM

టీడీపీ, జనసేన అధిపతులు తొలి విడత ‘గెలుపు గుర్రాల’తో సై అన్నారు. షెడ్యూలు విడుదలకంటే ముందే ... ఒకే రోజు, ఒకే విడతలో 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.

  • ఉమ్మడిగా ప్రకటించిన చంద్రబాబు, పవన్‌

  • 94 టీడీపీ 5 జనసేన 99 మందితో తొలి జాబితా

  • 18మంది సిటింగ్‌లు 24 మంది కొత్తవారు

  • టీడీపీ, జనసేన తొలి జాబితాలో ఒకరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఇద్దరు పీహెచ్‌డీ చేశారు. 30 మంది పీజీ చదివారు. ముగ్గురు ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా, గ్రాడ్యుయేట్లు 63మంది ఉన్నారు.

  • టీడీపీ టికెట్లు లభించిన 94 మందిలో 20 మంది దళితులు, 18 మంది బీసీలు, ముగ్గురు ఎస్టీలు, మైనారిటీ వర్గానికి చెందినవారు ఒకరు ఉన్నారు.

  • కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 21 మంది, రెడ్లు 17 మంది, క్షత్రియ

  • కులస్థులు నలుగురు ఉండగా, వెలమకు ఒకటి, వైశ్యులకు 2, కాపులకు 7 సీట్లు లభించాయి.

  • జనసేన ఇచ్చిన ఐదు సీట్లలో కాపులకు 2, గవర, బ్రాహ్మణ, కమ్మ వర్గాలకు ఒక్కొక్కటి దక్కాయి.

టీడీపీ, జనసేన అధిపతులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తొలి విడత ‘గెలుపు గుర్రాల’తో సై అన్నారు. షెడ్యూలు విడుదలకంటే ముందే ... ఒకే రోజు, ఒకే విడతలో 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 94 మంది టీడీపీ (Telugu Desam) అభ్యర్థులు... ఐదుగురు జనసేన (Janasena) అభ్యర్థులు! పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కూటమిలో కలవాలని భావిస్తున్న బీజేపీకి 4 లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఒకటీ అరా పేర్లతో, అది కూడా ‘మీరు అభ్యర్థులు కాదు.. సమన్వయకర్తలు మాత్రమే’ అని అధికార పార్టీ తడబడుతుండగా... టీడీపీ దూకుడుగా ఒకేసారి 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం!


Updated Date - Feb 25 , 2024 | 08:08 AM

Advertising
Advertising