ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Department of Mines : మరింత ‘ఇసుక’

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:05 AM

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రతిపాదనకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే... ‘ఉచిత’ రీచ్‌లకు అదనంగా ప్రైవేటు రీచ్‌లనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరు ఏదైనా... ప్రజలకు అవసరమైన ఇసుక,

  • త్వరలో ప్రైవేటు ఇసుక రీచ్‌లు

  • ‘ఉచితానికి’ అదనంగా ఏర్పాటు

  • రీచ్‌ల నిర్వహణ ప్రైవేటుకు

  • ముఖ్యమంత్రి ముందు గనుల శాఖ ప్రతిపాదన

  • డిమాండ్‌ మేరకు సరఫరా

  • ఆన్‌లైన్‌తోపాటు రీచ్‌ల వద్దా బుకింగ్‌

అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రతిపాదనకు సర్కారు ఆమోదం తెలిపింది. అలాగే... ‘ఉచిత’ రీచ్‌లకు అదనంగా ప్రైవేటు రీచ్‌లనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరు ఏదైనా... ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఇసుకపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గనుల శాఖ అధికారులు పలు ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. రీచ్‌లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం వల్ల ఇసుక స్టాక్‌ పాయింట్ల పరిశీలన, నిరంతర, సరఫరా పర్యవేక్షణ సులభతరం అవుతుందని వివరించారు. అయితే... ఇసుక సరఫరా ధరను జిల్లా ఇసుక కమిటీలే నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు తావులేకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిసింది.

నిరంతర నిఘా, పర్యవేక్ష ణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్‌ల నిర్వహణకు జిల్లాల వారీగా టెండర్ల ద్వారా ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రైవేటు రీచ్‌లను ప్రారంభించాలని గనుల శాఖ ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీలు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకొని సొంతంగా రీచ్‌లను ప్రారంభించి ఇసుక తవ్వకాలు చేపడుతారన్నమాట. ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ప్రస్తుతం ఇసుక రీచ్‌లు గనుల శాఖ నియంత్రణలో ఉన్నాయి. వర్షాకాలం కావడంతో రీచ్‌ల్లో తవ్వకాలు చేపట్టడం లేదు. త్వరలో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ డిమాండ్‌కు సరిపడేంతగా ఇసుక అందుబాటులోకి రాదనే ఉద్దేశంతో ప్రైవేటు రీచ్‌ల ప్రతిపాదన తెస్తున్నట్లు గనుల శాఖ అధికారులు వివరించారు. ఈ రీచ్‌లలో ఇసుక ధరలను కూడా జిల్లా కమిటీలే నిర్ణయించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.


  • రీచ్‌ల వద్ద కూడా బుకింగ్‌

రీచ్‌ల వద్ద కూడా ఇసుక బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించాలని గనుల శాఖను సీఎం ఆదేశించారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అవకాశం దొరకని వారు రీచ్‌ల వద్దకు వెళ్లి బుకింగ్‌ చేసుకునేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇసుక దొరకడం లేదన్న ఆందోళనకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 43 రీచ్‌ల్లో కలిపి 10 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈనెల 16 నుంచి మరి కొన్ని మాన్యువల్‌ రీచ్‌లను ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు డీ-సిల్టింగ్‌ కాంట్రాక్టులు ఇచ్చారు. సగటున రోజుకు 50వేల టన్నుల మేర అందుబాటులోకి తీసుకురావాలని గనుల శాఖ సన్నహాలు చేస్తోంది. సగటున ఏడాదికి 3 కోట్ల టన్నుల ఇసుక అవసరం అని తేల్చారు. ఈ డిమాండ్‌ను చేరుకునేందుకు ప్రైవేటు రీచ్‌ల విధానం ప్రతిపాదించినట్లు తెలిసింది.

Updated Date - Oct 12 , 2024 | 03:06 AM