AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
ABN, Publish Date - Apr 27 , 2024 | 02:31 PM
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం 2 పేజీల్లోనే 9 హామీలను పొందుపరిచారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోనే తమకు ఖరాన్, బైబిల్, భగవద్గీత అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ వివిధ వేదికల మీద పలుమార్లు ప్రకటించిన విషయం విధితమే. మరి గత ఎన్నికల వేళ... అంటే 2019లో ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ తాము అధికారంలోకి వస్తే.. ఇవి చేస్తామంటూ పలు హామీలతో మేనిఫెస్టో పొందుపరిచారు.
అమరావతి, ఏప్రిల్ 27: సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.
కేవలం 2 పేజీల్లోనే 9 హామీలను పొందుపరిచారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోనే తమకు ఖరాన్, బైబిల్, భగవద్గీత అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ వివిధ వేదికల మీద పలుమార్లు ప్రకటించిన విషయం విధితమే. మరి గత ఎన్నికల వేళ... అంటే 2019లో ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ తాము అధికారంలోకి వస్తే.. ఇవి చేస్తామంటూ పలు హామీలతో మేనిఫెస్టో పొందుపరిచారు.
దీంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు వైసీపీకి గంపగుత్తగా ఓట్లు వేశారు. దాంతో ఆ పార్టీకి 151 సీట్లు రావడంతో... సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల వేళ.. సీఎం వైయస్ జగన్ మళ్లీ తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 2019 నాటి మేనిఫెస్టో... తాజాగా విడుదల చేసిన మేనిపెస్టోను.. నాడు - నేడు అనే కోణంలో ఓ సారి పరిశీలిస్తే...
2019లో... వైయస్ఆర్ చేయూత రూ. 75 వేలు
2024లో.. వైయస్ఆర్ చేయూత రూ. లక్షా 50 వేలకు పెంచనున్నారు.
2019లో.. వైయస్ఆర్ కాపు నేస్తం రూ. 60 వేలు..
2024లో.. వైయస్ఆర్ కాపు నేస్తం రూ. లక్షా 20 వేలకు పెంచనున్నారు. (నాలుగు దఫాలుగా పెంచనున్నారు.)
2019లో.. వైయస్ఆర్ ఈబీసీ నేస్తం రూ. 45 వేలు..
2024లో.. వైయస్ఆర్ ఈబీసీ నేస్తం రూ. లక్షా 5 వేల వరకు పెంపు (నాలుగు దఫాలుగా పెంచనున్నారు.)
2019లో.. అమ్మ ఒడి కింద రూ.15 వేలు
2024లో.. అమ్మ ఒడి కింద రూ.17 వేలు అందించనున్నారు. .
2019లో .. వైయస్ఆర్ సున్నా వడ్డి కింద రూ. లక్ష వరకు రుణం
2024లో.. వైయస్ఆర్ సున్నావడ్డి కింద రూ. 3 లక్షల వరకు రుణాలు అందించనున్నారు.
2019లో.. అనాధలు, వితంతువులు, అవ్వతాతలు, దివ్యాంగులకు పెన్షన్ రూ. 3 వేలు ఇస్తామన్నారు. ( అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.250 చొప్పున మూడు విడతలగా పెంచారు.)
2024లో .. పెన్షన్ రూ.3500కు పెంచనున్నారు. రెండు విడతల్లో పెంచుతామని స్పష్టం చేశారు.
2019లో.. వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ఇస్తామన్నారు.
2024లో.. వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫాలను కొనసాగిస్తామన్నారు.
2019లో.. రైతులకు అందించే రైతు భరోసా సొమ్ము రూ. 13,500 ఉంది
2024లో.. రైతులకు అందించే రైతు భరోసా సొమ్ము మొత్తాన్ని రూ.16 వేలకు పెంచారు. దీంతో అయిదేళ్ల కాలంలో రైతులకు రూ. 80 వేలు అందనుంది.
2019లో మత్స్యకార, వాహన మిత్రలు పథకాలు ప్రకటించారు.
2024లో.. ఈ పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
2019లో.... ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని.. అదీ కూడా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే అని చెప్పారు.
2024లో.. ప్రభుత్వ ఉద్యోగుల అంశమే లేదు.
2019లో.. యువతకు ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు.
2024లో... జాబ్ క్యాలెండర్ ఊసే లేదు
అలాగే పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటి పట్టాలు అందిస్తామన్నారు. నవరత్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని చెప్పారు.
పోర్టుల నిర్మాణం, మౌలిక వసతులు మరింతగా విస్తరిస్తామని వివరించారు. ఇక విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, నాడు - నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత లక్ష్యంగా పాలన సాగుతుందని సీఎం వైయస్ జగన్ విపులీకరించారు.
Read National News And Telugu News
Updated Date - Apr 27 , 2024 | 02:35 PM