Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ
ABN, Publish Date - May 12 , 2024 | 03:46 PM
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు(Dilli Rao) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి మోహన్ వచ్చారని చెప్పారు.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు(Dilli Rao) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి మోహన్ వచ్చారని చెప్పారు.
"జిల్లాకు సంబంధించి 3 ప్రాంతాల్లో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు చేశాం. విధుల్లో ఉన్న సిబ్బందిలో 95 శాతం మంది హాజరయ్యారు. వీరంతా ఈవీఎంలు ఎలా పని చేస్తున్నాయో ఇవాళ చెక్ చేస్తారు. గతంలో వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మధ్యాహ్నం 2 గంటలవరకు అధికారులందరినీ పోలింగ్ బూత్‌లకు తరలించాం. సిరా విషయంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది.
ఇది బయట వ్యక్తులకు దొరకదు. 1,267 కేంద్రాల్లో, సెంట్రల్ నియోజకవర్గంలో పూర్తిగా వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 14,350 మంది సిబ్బంది, 7 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. స్ట్రాంగ్స్ రూమ్స్‌లో అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులెవరికైనా అనుమానం ఉంటే రూమ్‌లను పరిశీలించవచ్చు" అని డిల్లీరావు వెల్లడించారు.
ఇది కూడా చదవండి:
Miyapur: 220 కేవీ కేబుల్ మంటల్లో దగ్ధం.. ఘటనపై పోలీసుల అనుమానం
Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్
Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్
Read Latest National News and Telugu News
Updated Date - May 12 , 2024 | 03:49 PM