AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే
ABN, Publish Date - Jun 01 , 2024 | 07:38 PM
aaraa poll strategies post poll Prediction on Pithapuram Assembly Seat AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే
ఏపీ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఆరా సంస్థ తన అంచనాలను వెల్లడించింది. ఏపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గెలుపుపై ఆరా సంస్థ తన అంచనాను వెల్లడించింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందని ఆరా సంస్థ తెలిపింది. భారీ మెజార్టీతో ఆయన విజయం సాధిస్తారని పేర్కొంది. వంగా గీత గట్టిపోటీ ఇస్తారని అంతా భావించారు. పోలింగ్ ముగిసిన తర్వాత పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తేలింది. అసలు ఫలితం జూన్4న రానున్నప్పటికీ ఇటీవల కాలంలో ఎగ్జిటపోల్స్ రియల్ రిజల్ట్‌కు దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో పిఠాపురంలో జనసేన జెండా ఎగరబోతుందని ఆరా సంస్థ అంచనా వేసింది.
AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..
మెజార్టీపై..
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి లక్ష మెజార్టీతో గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అంత మెజార్టీ సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 07:38 PM