Tree fell down: నేలకూలిన 150ఏళ్ల నాటి చెట్టు.. దాని చరిత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ABN, Publish Date - Aug 06 , 2024 | 10:32 AM
కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఓ చెట్టు ఉంది. దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చెట్టుకు ఓ పేరు ఉంది. అదే సినీ వృక్షం, వయస్సు 150సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆ చెట్టు ఎందుకంత ప్రత్యేకమో.
తూర్పుగోదావరి: కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఓ చెట్టు ఉంది. దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చెట్టుకు ఓ పేరు ఉంది. అదే సినీ వృక్షం, వయస్సు 150సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆ చెట్టు ఎందుకంత ప్రత్యేకమో. ఆ వృక్షం దాదాపు 300సినిమాల్లో కనిపించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి ప్రముఖుల సినిమాలు సహా మరెన్నో చిత్రాల్లో కనిపించింది. డైరెక్టర్లు, హిరోలు ఆ చెట్టు వద్ద సినిమాలు తీసేందుకు ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు.
అయితే మరిప్పుడు ఆ చెట్టు ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ సినీ వృక్షం ఇక లేదు. రెండుగా చీలి నేలకూలింది. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. ఎంతో మంది తారలను తమ గ్రామానికి రప్పించిన వృక్షం ఇక లేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఆ నిద్రగన్నేరు చెట్టు నేలకొరిగింది. ఆ చెట్టు గురించి స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు కథలుకథలు చెప్పుకుంటారు. సినిమా షూటింగ్ ఉన్నప్పుడల్లా తారలు వస్తారని పెద్దఎత్తున ఆ గ్రామానికి ప్రజలు చేరుకునేవారు. అయితే ఇప్పుడిక వారికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ప్రకృతి వైపరిత్యం, పాలకుల నిర్లక్ష్యం వృక్షం రెండుగా చీలి కాలగర్భంలో కలిసిపోయేలా చేసింది. ఎంతో కీర్తి కలిగిన ఆ చెట్టు సంరక్షణకు పాలకులు, టూరిజం డిపార్ట్మెంట్ శ్రద్ధ చూపించలేదు. గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టు.. ప్రతి ఏటా వరదల కారణంగా కోతకు గురై రెండుగా చీలిపోయింది. దీంతో సినీ వృక్షం ఇక లేకుండా పోయింది.
ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు సహా అనేక మంది ప్రముఖ డైరెక్టర్లు ఇక్కడ వందల కొద్దీ చిత్రాలు రూపొందించారు. అక్కినేని నాగేశ్వరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రనాయకులు సైతం ఇక్కడ సినిమా తీసేందుకు ఇష్టపడేవారు. కనీసం ఒక్క సీన్ అయిన తమ చిత్రంలో ఈ చెట్టు ఉంటే హిట్ అవుతుందని చాలామంది నటులు, డైరెక్టర్లు నమ్మేవారు. అయితే మెుదటగా 1975లో వచ్చిన పాడి పంటలు చిత్రంతో దీనికి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు సహా అనేక హిట్ చిత్రాలు ఇక్కడ నిర్మించారు. అయితే కూలిపోయిన చోటే మరో చెట్టు నాటేందుకు రాజమహేంద్రవరం రైజింగ్ సంస్థ ముందుకొచ్చింది. దాని స్థానంలో 20అడుగుల వృక్షాన్ని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Balineni Srinivasa Reddy: చీట్ చేసిన వారి సంగతి తేలుస్తా: బాలినేని
Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..
Updated Date - Aug 06 , 2024 | 11:15 AM