ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dwarampudi Chandrasekhar Reddy: అవినీతి ‘ద్వారం’ బద్ధలు!

ABN, Publish Date - Jul 06 , 2024 | 01:19 AM

లేకలేక అధికారం చేతికి రావడంతో ఎమ్మెల్యేగా ఉండగా ఆయన విర్రవీగిపోయాడు. నా అంతటోడు లేడనుకుని ఐదేళ్లు విచ్చలవిడిగా వ్యవహరించాడు. సాక్షాత్తూ సీఎం తనకు సన్నిహితుడు కావడంతో ఆ వంకతో నియోజకవర్గంలోను, జిల్లాలోను తానే ఓ సీఎం తరహాలో నిరంకుశంగా వ్యవహరించాడు. కనిపించిన కొండలు, గుట్టలను మింగేశాడు. తనకున్న వ్యాపారాలను నిబంధనలను ఖాతరు చేయకుండా నడిపాడు.. కన్నేసిన కోట్ల విలువైన భూములను కబ్జా చేసి పారేశాడు. అవినీతి, అక్రమాలకు ద్వారం తెరిచాడు..

  • బద్ధలవుతున్న కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పాపాల పుట్ట

  • అధికారం చేతిలో ఉన్న అయిదేళ్లు విచ్చలవిడిగా చెలరేగిపోయిన వైనం

  • నా అంతటోడు లేడనేలా విర్రవీగుడు: ఎక్కడికక్కడ దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలు

  • తీరా ఇప్పుడు పార్టీ ఓటమి పాలవడంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి పాపాల చిట్టా

  • ద్వారంపూడి చుట్టూ బిగుస్తున్న వందల కోట్ల రేషన్‌బియ్యం మాఫియా స్కాం

  • ద్వారంపూడి కుటుంబం లక్షల టన్నుల రేషన్‌ బియ్యం ఎగుమతులపై లోతుగా ఆరా

  • కేసును సీఐడీకి అప్పగించబోతున్నట్లు మంత్రి నాదెండ్ల ప్రకటనలో గుబులు

  • వెలుగులోకి ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీల అక్రమాలు: పీసీబీ నోటీసులతో గుట్టురట్టు

  • అధికారం అండతో కాకినాడలో ద్వారంపూడి బంధువులు, అనుచరులు అక్రమ నిర్మాణాలు

  • కూల్చివేతకు అడుగులు ప్రారంభించిన కార్పొరేషన్‌ 8 అడ్డుకున్నందుకు ద్వారంపూడి, ఆయన అనుచరులపై కేసు

  • ద్వారంపూడి అనుచరుడి కబ్జా చెర నుంచి రూ.25కోట్ల విలువైన భూమికి విముక్తి

  • కాకినాడ పోర్టులో రూ.73కోట్ల స్వాహాపై ఎమ్మెల్యే కొండబాబు ఆధారాలతో బయటకు

  • భయం వీడి న్యాయం కోసం రోడ్డెక్కిన భాస్కర బిల్డింగ్‌ బాధితులు

  • ద్వారంపూడి అనుచరుల గంజాయి సేవనం కోసం ఐదేళ్లుగా మూసేసిన రోడ్డుకు మోక్షం

లేకలేక అధికారం చేతికి రావడంతో ఎమ్మెల్యేగా ఉండగా ఆయన విర్రవీగిపోయాడు. నా అంతటోడు లేడనుకుని ఐదేళ్లు విచ్చలవిడిగా వ్యవహరించాడు. సాక్షాత్తూ సీఎం తనకు సన్నిహితుడు కావడంతో ఆ వంకతో నియోజకవర్గంలోను, జిల్లాలోను తానే ఓ సీఎం తరహాలో నిరంకుశంగా వ్యవహరించాడు. కనిపించిన కొండలు, గుట్టలను మింగేశాడు. తనకున్న వ్యాపారాలను నిబంధనలను ఖాతరు చేయకుండా నడిపాడు.. కన్నేసిన కోట్ల విలువైన భూములను కబ్జా చేసి పారేశాడు. అవినీతి, అక్రమాలకు ద్వారం తెరిచాడు.. ఏ టెండర్‌ పిలిచినా తెరవెనుక తన మనుషులను పంపి పనులు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేశాడు. కార్పొరేషన్‌ నిబంధనలు అతిక్రమించి తన వాళ్లు సొంత భవనాలను కట్టుకునేలా అడ్డుగా నిలబడ్డాడు. తనకు ఎదురుగా రూల్స్‌ మాట్లాడిన అధికారులను నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రే శంకరగిరి మాన్యాలు పంపేశాడు. ఓ పక్క రెండు చేతులతో వందల కోట్ల సంపాదన.. మరోపక్క అడ్డొచ్చిన వారిని నోటితో పచ్చిబూతులు తిడుతూ కన్ను మిన్ను కానకుండా అయిదేళ్లు అరాచకం సృష్టించాడు. తీరాకాలం తిరగబడ్డంతో ఇప్పుడు అధికారం కోల్పోయి విలవిల్లాడుతున్నాడు. ఒక్కో పాపం బద్ధలవుతుండంతో వణికిపోతున్నాడు. ఎప్పుడు ఏమూలన తన పాతకాలు పండుతాయోనని కునుకులేకుండా కలవర పడుతున్నాడు. అతడే కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. ఎన్నికల్లో ఓటమి పాలవడంతో అయిదేళ్లలో ఈయన అరాచకాలు, అక్రమాలు, పాపాలు ఒక్కోటిగా బయటపడుతుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

అంతా నా ఇష్టం..

కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చం ద్రశేఖరరెడ్డి జూన్‌ 4కు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే. అంతకుమించి సీఎం జగన్‌ సన్నిహితుడు. ఇతడి పేరెత్తితే భయపడని వారంటూ లేరు. జిల్లా అధికారులనుంచి జిల్లా లో సొంతపార్టీ మంత్రి, ఎమ్మెల్యే వరకు ఆయన అంటే హ డల్‌. ఆయన చెప్పిందే వేదం. ఆదేశించిందే శాసనం. ఆయ నకు ఎదురుతిరిగితే వైసీపీ రాజ్యసభ సభ్యుడైనా, ఆర్డీవో అయినా, కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ అయినా, కలెక్టర్‌ అయినా వెనక్కు తగ్గాల్సిందే. లేదంటే బూతులు.. కాదంటే బదిలీలు ఇలా ఒకటేంటి ఐదేళ్లపాటు ఓ నయా నియంతలా చెలరేగిపోయారు. తన మాటకు ఎదురు లేదన్నట్లు విరగ బడ్డాడు. జగన్‌ పేరు చెప్పి జిల్లాను గుప్పిట పట్టాడు. కనిపించిన వనరులను కొల్లగొట్టేశాడు. పేదల ఇళ్ల స్థలాల చదును పేరుతో కోట్లు మెక్కేశాడు. కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఈయనేం చెప్తే అంత అన్నట్లు చెలరేగిపోయాడు. ఇలా ఒకటేంటి విరగబాటుకు, విచ్చలవిడితనానికి మారు పేరుగా రెచ్చిపోయారు. విలువైన భూము ల కబ్జాలు, ఇసుక వ్యాపారం, సొంత కంపెనీలు నిబంధనలు లేకుండా నడిపిం చడం, రేషన్‌ బి య్యం మాపియా, విదేశాలకు వందల కోట్లలో అడ్డగోలు ఎగుమతులతో ఎదురేలేదన్నట్లు వ్యవహ రించారు. గత అయిదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు సీఎం తరహాలో పెత్తనం సాగించారు. కబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమ వ్యాపారాలు అనేక రూపాల్లో ద్వారంపూడి విశ్వ రూపం ప్రదర్శించి అవినీతి మేతలో రికార్డులు సృష్టించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడి పోవడం, ద్వారంపూడి సైతం కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఓటమి పాలవడంతో ఇప్పుడు జిల్లా, కాకినాడ సిటీ నియోజ కవర్గాల పరిధిలో ఇతడి అక్రమాలు, అరాచకాలు, పాపాలు ఒక్కోటిగా బయటపడుతుండడం సంచలనం రేపుతోంది. ఐదేళ్ల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతుండడంతో ఐదేళ్లలో ఇన్ని అరాచకాలకు పాల్పడ్డాడా అనే చర్చ ప్రజల్లోను, సొంత పార్టీలోను జరుగుతోంది.

ప్రధానంగా ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకి నాడలో రెండు రోజులు పర్యటించారు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమవుతోన్న రేషన్‌ బియ్యం మాఫి యాపై ఉక్కుపాదం మోపారు. ఆరు గోడౌన్లలో వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సీజ్‌ చేశారు. కాకినాడ పోర్టునుంచి విదే శాలకు రేషన్‌ బియ్యం ఎగుమతులను తాత్కాలికంగా నిలిపి వేశారు. దీంతో ద్వారంపూడి ఐదేళ్లనుంచి రెట్టింపు స్థాయిలో చేసిన బియ్యం అక్రమ వ్యాపారం గుట్టును మంత్రి బయట కు తీశారు. ద్వారంపూడి కుటుంబం రేషన్‌ బియ్యాన్ని పాలి ష్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసి ఎలా సంపాదిస్తున్నదీ బయట ప్రపంచానికి తెలిపారు. గోదాముల్లో సేకరించిన బియ్యం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. ఈ దాడుల్లో ద్వారంపూడికి ప్రధాన అనుచరులుగా ఉన్న అలీషాతోపాటు మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. వేలకోట్ల రేషన్‌ బియ్యం కుంభకోణాన్ని త్వరలో కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించేందుకు చకచకా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చీకటి బియ్యం వ్యాపారం బద్ధలు కానుంది. ఈ కేసులో ద్వారంపూడి నిండా మునిగిపోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

ఎంతలా చెలరేగిపోయాడో...

అధికారం చేతిలో ఉన్నప్పుడు ద్వారంపూడి, ఆయన అను చరులు కాకినాడ రూరల్‌ నియోజకవర్గం వాకలపూడిలో నాలుగున్నర ఎకరాల భూమిని కబ్జా చేసేశారు. రూ.25కోట్ల విలువైన భూమిని చెరబట్టారు. దీని పై స్థల యజమానులు పోలీసులను ఆశ్రయించా రు. కానీ ద్వారంపూడి బలానికి భయపడి ఆ భూ మి జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ద్వారంపూడి చేతిలో అధికారం లేకపోవడంతో బాధితులకు ధైర్యం వ చ్చింది. ప్రాణభయం పోవడంతో ఎట్టకేలకు గురు వారం తన భూమిలోకి ధైర్యంగా అడుగుపెట్టారు. ఎక్స్‌కవేటర్లతో అడ్డగోలుగా నిర్మించిన ప్రహారీని ధ్వంసం చేసి తన భూమిని తమ చేతిలోకి తీసు కున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లి, ప్రత్తిపాడు నియోజకవర్గం లంపకలోవలో ద్వారంపూడికి రెండు రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ రెం డుచోట్ల వ్యర్థజలాల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించ డం లేదు. అధికారం చేతిలో ఉండడంతో ఇన్నాళ్లు కాలుష్య విభాగం అధికారులు నోరెత్తలేదు. కానీ ఆశాఖ మంత్రి పవ న్‌కళ్యాణ్‌ ఇటీవల సమీక్షించినప్పుడు ఈ కంపెనీలో లోపా లు భారీగా బయటపడ్డాయి. ఈనెల 3న అధికారులు ఈ రొయ్యల ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేసి అనేక తప్పులు గుర్తించి నోటీసులు జారీ చేయడంతో ద్వారంపూడి భాగోతం వెలు గులోకి వచ్చింది. కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఎవరు ఏ భవనం నిర్మించినా అనుమతులు తీసుకోవాలి. కానీ ద్వారం పూడి తనకు రూల్స్‌తో పనిలేదనుకున్నాడు. ఆయన మను షులు అడ్డగోలుగా భవనాలు నిర్మించినా అధికారులు పట్టిం చుకోలేదు. తాజాగా లక్ష్మీ ఆస్పత్రి సమీపంలో ఓ అక్రమ భ వనం నిర్మాణాన్ని కూల్చివేయడానికి వెళ్లారు. దీన్ని ద్వారం పూడి అడ్డుకున్నారు. కూల్చడానికి వీల్లేదని హెచ్చరించారు. అయినా అధికారులు పట్టువీడకపోవడంతో చేతిలో అధికా రం లేని ద్వారంపూడి దారికి వచ్చాడు. అదే సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని అధికారుల ఫిర్యాదు తో పోలీసులు ద్వారంపూడిపై గురువారం రాత్రి కేసు నమో దు చేశారు. ఈయన అధికార పీఏగా పనిచేసిన సుబ్బా రావు, వ్యక్తిగత పీఏ గోవిందరాజులు సైతం పలుచోట్ల అక్ర మ భవన నిర్మాణాలు చేపట్టడం, చేపట్టిన వారినుంచి లం చాలు తీసుకున్న ఫిర్యాదులు రావడంతో త్వరలో వాటి భర తం పట్టనున్నారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆధునికీకరణ పనులు చేపట్టారు.

సము ద్రంలో డ్రెడ్జింగ్‌ పనుల్లో ద్వారంపూడి రూ.73కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు నేరుగా ఆధారాలతో గురువారం బయటపెట్టారు. దీనిపైనా లోతుగా దర్యాప్తు చేయనున్నారు. తన మనుషులు గంజాయి సేవనానికి ఇబ్బందిగా ఉందనే కారణంతో నగరంలో డంపింగ్‌ యార్డుకు వెళ్లే రహదారిని ద్వారంపూడి అయి దేళ్లుగా మూసేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే కొండబాబు ఈ రహదారిని తిరిగి తెరిపించడం ద్వారంపూ డి దౌర్జన్యాన్ని బయటపెట్టింది. భాస్కర బిల్డింగ్‌ పేరుతో కాకినాడ సినిమా రోడ్డులో అపార్ట్‌మెంట్‌ల్లో ఇళ్లను ద్వారం పూడి విక్రయించారు. తీరా నాలుగేళ్ల కిందట అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు ఓ పక్కకు వంగిపోయాయి. దీంతో అపార్ట్‌మెంట్‌ను అంతా ఖాళీ చేసేశారు. ఈ నేపథ్యంలో తమ డబ్బులు తిరి గి ఇవ్వాలని బాధితులు కోరినా ద్వారంపూడి ఖాతరు చేయ లేదు. అధికారులు, పోలీసుల దగ్గరకు వెళ్లినా అమ్మో.. ద్వారంపూడి విషయంలో జోక్యం చేసుకోలేమనేశారు. ఇప్పు డు సదరు నేత అధికారం పోవడంతో బాధితులు ధైర్యం తె చ్చుకుని పోరాటం సాగిస్తున్నారు. ఇలా ఒకటేంటి అనేక పా పాలు వరుసపెట్టి బద్ధలవుతుండడంతో ద్వారంపూడి అరాచ క సామ్రాజ్యం కుప్పకూలుతోందనే చర్చ జరుగుతోంది.

మున్సిపల్‌ షాపుల్లో ఆక్రమణల తొలగింపు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి అండతో ఆక్రమించిన నగరపాలక సంస్థ షాపులను అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. కాకినాడ సంజయ్‌నగర్‌ డైరీఫాం సెంటర్‌లో శ్రీపిడుగులమ్మతల్లి మార్కెట్‌ వర్తకులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్‌నుంచి అనుమతి లేకుం డా వ్యాపారం చేస్తున్నవారిని అధికారులు షాపులు ఖాళీ చేస్తుండగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2023, అక్టోబరులో నగరపాలకసంస్థకు చెందిన 24 షాపులను అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి ప్రారంభించారు. నగరపాలకసంస్థ వేలం ప్రకట న ఇవ్వకుండానే వైసీపీఅనుకూల వ్యాపారులు షాపులు ఆక్రమించారు. కార్పొరేషన్‌కి అడ్వా న్స్‌, అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో నగరపాలక సంస్థ రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులతోపాటు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాల య అధికారులు, పోలీసులు సహకారంతో ఆక్రమణలు తొలగించారు. కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ శేఖర్‌, డీఈ మాధవి మాట్లాడుతూ టెండర్లు నిర్వహించకుండా 24షాపుల్లో వ్యా పారాలు నిర్వహిస్తున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాళీ చేయించామన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 09:20 AM

Advertising
Advertising