ఐపీఎల్ తరహాలో గోదావరి క్రికెట్ ప్రీమియర్ లీగ్
ABN, Publish Date - Oct 21 , 2024 | 01:26 AM
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్‌లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు
డిసెంబరు 1 నుంచి 12 వరకు కాకినాడలో నిర్వహణకు ఏర్పాట్లు
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్ తరహాలో జీపీఎల్ ప్రీ మియర్‌లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు జరిగే ఈ టోర్నమెంటులో ఆరు జట్లుగా ఏర్పా టుచేసి పోటీలు పెడతారన్నారు. మిరాకిల్ ఇం జనీరింగ్ సౌజన్యంతో ఏర్పాట్లు చేస్తారన్నారు. అమ్పీఫ్లై స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి ఎస్.కరుణాకర్ మాట్లాడుతూ డేవిడ్ కాకినాడ కింగ్స్, చిట్ల కిరణ్ పిఠాపురం పాంథర్స్, హరీష్ కోనసీమ లయన్స్,లోవస్ రామచంద్రపురం రాయల్స్, జీ వీ కే తుని డస్కస్, షణ్ముఖ గోదావరి రైడర్స్ జట్ల మధ్య పోటీలు నిర్వహిస్తామన్నారు. టో ర్నమెంట్‌కు వైస్‌చైర్మన్‌గా చిట్టూరి డేవిడ్ వ్యవ హరిస్తారన్నారు. ఆటగాళ్లకు వేలం నిర్వహించి 20-20తరహాలో పోటీలకు శ్రీకారం చుట్టారు.
ముగిసిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు
కాకినాడఅర్బన్, అక్టోబరు 20: మూడురోజులుగా కాకినాడలో నిర్వహిస్తున్న అంతర్‌జిల్లాల స్కేటింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్-11, 14, 17, 19 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి ఎల్.జార్జి తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ సీఈవో బి.శ్రీనివాసకుమార్, హరీష్ చారిటబుల్‌ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, పరిశీలకులు ఎస్.దిలీప్‌కుమార్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.రవిరాజు, కార్యదర్శి కె.నూకరాజు, స్కేటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్, దొరైస్వామి, జి.సునీల్‌కుమార్, పరుశరామ్ పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికలు
నవంబరు రెండోవారంలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైన క్రీ డాకారుల వివరాలివి. అండర్-11 విభాగంలో బా లికల్లో.. విశాఖకు చెందిన దూసర్లపూడి ప్రియానందశ్రీవర్షిణి, షాయిఖ్ దిల్‌సద్ అమీనా, చాం తాటి చార్వి ఉన్నారు. బాలురలో.. తూర్పుగోదావరికి చెందిన ఎస్.శ్యామ్‌సుందర్‌రెడ్డి, అనంతపురానికి చెందిన ఆర్.సాయి కార్తీకరెడ్డి, చిత్తూరుకు చెందిన సి.జతిన్‌రెడ్డి ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో తూర్పుగోదావరికి చెందిన కె.భవ్యశ్రీ, చిత్తూరుకు చెందిన కామిశెట్టి ఖ్యాతి, కృష్ణాజిల్లా కు చెందిన సాన్వి రఫియా, బాలురలో తూర్పుగోదావరికి చెందిన ఎ.మహీధర్ రాజకుమార్, ఆర్.శ్రీఅఖిల్‌రిషివర్మ, కృష్ణాజిల్లాకు చెందిన బలరాం ఉన్నారు. అండర్-17 బాలికల్లో తూర్పుగోదావరికి చెందిన మహమ్మద్ హనీఫ్‌మోహన్, విశా ఖకు చెందిన పెరవలి శ్రీకీర్తి, నెల్లూరుకు చెందిన పి.యశశ్విని, బాలురలో చిత్తూరుకు చెందిన షా యిక్ అమీర్, కృష్ణాజిల్లాకు చెందిన పి.యోషిత్‌రెడ్డి, మధులీలావెంకట సుధీర్ ఎంపికయ్యారు.
క్వాడ్ విభాగంలో అండర్-11 బాలబాలికల్లో గుంటూరుకు చెందిన తన్మయినాగదుర్గ, నెల్లూరుకు చెందిన సీహెచ్.నాగజ్యోత్స్న, తూర్పుగోదావరికి చెందిన మోసా హనీసుసాన్, విరోధి రిషీశ్వర్, విశాఖకు చెందిన కరణం జైచందన్, గుం టూరుకు చెందిన వై.జినేష్‌సాయి ఉన్నారు. అం డర్-14లో నెల్లూరుకు చెందిన నందిని, ఆద్వి రమ్య, కృష్ణాజిల్లాకు చెందిన తనూజసాయి, తూ ర్పుగోదావరికి చెందిన నిఖిల్ ఈశ్వర్, చందు శ్రీధర్, కృష్ణాజిల్లాకు చెందిన ఫర్ణీస్ ఉన్నారు.
అండర్-17 క్యాడ్ విభాగం.. బాలికల్లో తూర్పుగోదావరికి చెందిన వీవీ వీరవర్షిని, విశాఖకు చెందిన విద్యా ప్రజాపతి, నెల్లూరుకు చెందిన ఎస్.జెస్మిత, బాలురలో విశాఖకు చెందిన పూటిపల్లి జాన్సన్, అంబుజి లోహిత్‌సాయి, బుడ్డిగ శశాంక్ ఎంపికయ్యారు. అండర్-19లో చిత్తూరు కు చెందిన కె.స్నేహకృతి, కృష్ణాకు చెందిన జయ శ్రీసాయి, ఆర్.జశ్వంత్, చిత్తూరుకు చెందిన కె.వింధ్యన్ జట్టులో స్థానం దక్కించుకున్నారు.
Updated Date - Oct 21 , 2024 | 01:26 AM