Harsha Kumar: గత ఎన్నికల్లో ఆ రెండు కారణాలతో జగన్ సీఎం అయ్యారు
ABN, Publish Date - Mar 02 , 2024 | 09:53 PM
సీఎం జగన్ రెడ్డి(CM Jagan) గత ఎన్నికల్లో మాజీమంత్రి వివేకానందారెడ్డి (బాబాయ్) హత్య, కోడి కత్తి శీను పేరు చెప్పి లాభం పొందారని మాజీ ఎంపీ హర్ష కుమార్(Harsha Kumar) అన్నారు. శనివారం నాడు హర్ష కుమార్‌ను కోడి కత్తి శీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.
రాజమండ్రి: సీఎం జగన్ రెడ్డి(CM Jagan) గత ఎన్నికల్లో మాజీమంత్రి వివేకానందారెడ్డి (బాబాయ్) హత్య, కోడి కత్తి శీను పేరు చెప్పి లాభం పొందారని మాజీ ఎంపీ హర్ష కుమార్(Harsha Kumar) అన్నారు. శనివారం నాడు హర్ష కుమార్‌ను కోడి కత్తి శీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన కేసు విషయంలో మద్దతు తెలిపినందుకు హర్ష కుమార్‌కు శీను కృతజ్ఞతలు తెలిపారు. శీను, కేసు వాదించిన న్యాయవాది సలీంను హర్షకుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా హర్ష కుమార్ మాట్లాడుతూ.... ఏదో ఒక సంచలనం చేసి జగన్‌ను సీఎంగా చేయాలని కోడి కత్తి శీను నేరం చేశారని చెప్పారు.
కోర్టు నిబంధనల కారణంగా కోడికత్తి శీను మాట్లాడ్డానికి లేదని అన్నారు. శీను వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని గత ఎన్నికల్లో జగన్ చెప్పి చాలా సానుభూతి పొందారన్నారు.. వివేకా కుమార్తె సునీతారెడ్డి జగన్ నిజస్వరూపన్ని బయటపెట్టారని తెలిపారు. ఎన్నికలు అయ్యేవరకు కోడి కత్తి శీను బయటికి రాడని జగన్ అనుకున్నారని చెప్పారు. న్యాయవాద సలీం కారణంగా ఎన్నికలకు ముందే శీను జైలు నుంచి బయటకు వచ్చారని అన్నారు.
అందుకే హర్షకుమార్‌ను కలిశా: కోడి కత్తి శీను
తనకు మద్దతు తెలిపిన అందరికీ స్వయంగా వెళ్లి ధన్యవాదాలు చెబుతున్నానని కోడి కత్తి శీను(Kodi kathi Seenu) అన్నారు. ముందుగా హర్ష కుమార్ వద్దకు వచ్చానని శీను తెలిపారు.
కోర్టుకు హాజరు కాకపోతే జగన్‌పై కూడా కేసు వేస్తా: న్యాయవాది సలీం
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు న్యాయ పోరాటం చేస్తానని శీను తరపు న్యాయవాది సలీం అన్నారు. దళిత యువకుడు ఎంతగా బాధపడ్డాడో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. ఎన్నికల్లోపే సీఎం జగన్‌ను కోర్టుకు రప్పిస్తామని హెచ్చరించారు. కోర్టుకు హాజరు కాకపోతే జగన్‌పై కూడా కేసు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దళిత యువకుడిపై జగన్ జాలి చూపించలేదని మండిపడ్డారు. కోడి కత్తి శీను కేసు కామెడీగా ఉందన్నారు. పందెంకోడి 3 సినిమాల ఉందని ఎద్దేవా చేశారు.
Updated Date - Mar 02 , 2024 | 10:12 PM