విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలి : మంత్రి
ABN, Publish Date - Sep 14 , 2024 | 11:58 PM
జేఎన్టీయూకే, సెప్టెంబరు 14: విద్యార్థులు భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, సమాజానికి ఉపయోగపడే శక్తిగా త యారుకావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు నిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ అలూమ్ని ఆడిటోరియంలో ఐఐఐ పీటీ డైరెక్టరేట్, పైడా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంయు
జేఎన్టీయూకే, సెప్టెంబరు 14: విద్యార్థులు భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, సమాజానికి ఉపయోగపడే శక్తిగా త యారుకావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు నిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ అలూమ్ని ఆడిటోరియంలో ఐఐఐ పీటీ డైరెక్టరేట్, పైడా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘బేసిక్ ఇంజనీరింగ్ స్కిల్స్’ అంశంపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇన్‌చార్జి వీసీ కేవీఎస్‌జీ మురళీకృష్ణ, విశిష్ట అతిఽథిగా మంత్రి, అతిథులుగా ఖతర్‌లోని ఓరిక్స్‌జీటీఎల్ కంపెనీ సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, విజ్జేశ్వరంలోని రెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ రేఖపల్లి శ్రీనివాస్, పైడా విద్యా సంస్థల కార్యదర్శి పైడా సత్యశ్రీరాం పాల్గొనగా ఐఐఐపీటీ డైరెక్టర్ డాక్టర్ బీటీ కృష్ణ కన్వీనర్‌గా, డాక్టర్ పి.వంశీకృష్ణ రాజా సహ కన్వీనర్‌గా వ్యవహరించారు. సదస్సులో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, పైడా కళాశాల డీడీ రవీంద్ర, ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Sep 14 , 2024 | 11:58 PM