ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆక్రమణ తొలగింపు..

ABN, Publish Date - Jun 18 , 2024 | 04:48 PM

అనపర్తి ఆంజనేయనగర్‌లో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి(Satthi Suryanarayana Reddy) రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (MLA Ramakrishna Reddy)తొలగించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గోడ నిర్మించటంతో ఐదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తూర్పుగోదావరి: అనపర్తి ఆంజనేయనగర్‌లో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి(Sathi Suryanarayana Reddy) రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (MLA Ramakrishna Reddy) తొలగించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గోడ నిర్మించటంతో ఐదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడంతో స్థానికురాలు అరుణ కుమారి కుటుంబం నడిచేందుకు దారి లేకుండా పోయింది. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.


అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అరుణ కుమారి.. సూర్యనారాయణ రెడ్డి తమ కుటుంబాన్ని మానసికంగా తీవ్రంగా వేధించారంటూ సూసైడ్ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను తొలగించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం, స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Nara Lokesh: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్..

MLC Anuradha: పోలవరాన్ని మాజీ సీఎం జగన్ అదోగతి పాలు చేశారు: ఎమ్మెల్సీ అనురాధ

Updated Date - Jun 18 , 2024 | 04:48 PM

Advertising
Advertising