ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Purandeshwari: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించింది

ABN, Publish Date - Jul 08 , 2024 | 12:57 PM

Andhrapradesh: వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కోసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు.

MP Daggubati Purandeshwari

రాజమండ్రి, జూలై 8: వైసీపీ (YSRCP) పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeshwari) వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో (Rajahmundry) జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురందేశ్వరి వెల్లడించారు.

Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..


ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్లే...

ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందన్నారు. 2019లో బీజేపీకి 23 కోట్ల ఓట్లు వచ్చాయని.. 2024 ఎన్నికల్లో 24 కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. బీజేపీకి గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓట్ల సంఖ్య పెరిగిందన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఎంపీ సీట్ల సంఖ్య కొంచెం తగ్గిందన్నారు. కాంగ్రెస్ (Congress) రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిందన్నారు. మోదీ ప్రభుత్వం (Modi Government) రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి ఏపీకి సుపరిపాలన అందిస్తుందని ప్రజలు అధికారం ఇచ్చారని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.

AP Politics: కొడుకును చూసి తల్లి కన్నీళ్లు.. జగన్ రియాక్షన్ చూడాల్సిందే..


హాజరైన వారు వీరే..

రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, సుజనాచౌదరి, ఈశ్వరరావు, పార్థసారధి హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

AP Free Sand policy: ఉచిత ఇసుక పాలసీపై విడుదల కానీ జీవో..

AP Politics: జగన్‌కు షర్మిల మరో బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 01:01 PM

Advertising
Advertising
<