ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...

ABN, Publish Date - Jul 10 , 2024 | 11:25 AM

Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం...

MP Purandeshwari

రాజమండ్రి, జూలై 10: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeshwari), మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం మాజీ ఎంపీ మురళీమోహన్ కృషి చేశారని గుర్తుచేశారు. గత ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharath)వంతెన నిర్మాణం కోసం కృషి చేసినట్టు అబద్ధ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రచారం కోసం శిలాఫలకం ఏర్పాటు చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ప్లైవోవర్ పనులను పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకువస్తామని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.

Hyderabad : 10,000 కోట్లు సిద్ధం?


వంతెన కోసం ఎంతో కృషి చేశా: మురళీ మోహన్

‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడే మోరంపూడి ప్లైవోవర్ వంతెన కోసం కృషి చేశాను. మోరంపూడి సెంటర్‌లో జరిగిన ప్రమాదాలను అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్ళి వంతెన నిర్మాణ పనులు మంజూరు చేయించాను. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వంతెన నిర్మాణ పనులు ఆయనే మంజూరు చేయించినట్టు ప్రచారం చేసుకోవటం సరికాదు. వంతెన నిర్మాణ పనులు నేను మంజూరు చేయించిన విషయం కేంద్ర మంత్రికి, రాజమండ్రి ప్రజలకు తెలుసు’’ అని మాజీ ఎంపీ మురళీ మోహన్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

TDP: టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం

Free Sand Scheme: సగం ధరకే ఇసుక..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 11:35 AM

Advertising
Advertising
<