ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: పీతపై నరసింహస్వామి ఆకారం.. చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

ABN, Publish Date - Jul 23 , 2024 | 10:05 PM

సఖినేటిపల్లి లంక గ్రామంలో అద్భుతం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి లంక గ్రామంలో అద్భుతం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.


లంక గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తి ఎప్పటిలాగానే స్థానికంగా ఉండే ఓ దుకాణం వద్ద పీతలు కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. శుభ్రం చేస్తు్న్న సమయంలో ఒక పీత విచిత్రంగా ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే దాన్ని బయటకు తీసి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పీతపై నరసింహస్వామి ముఖ గుర్తులు కన్పించటంతో చుట్టుపక్కల వారిని పిలిచి చూపించారు. ఇలాంటి పీతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ కృష్ణ చెప్తున్నారు.


విషయం ఆ నోట ఈ నోట గ్రామం మెుత్తం పాకడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫొటోలు తీసుకుని కుటుంబసభ్యులు, బంధువులకు పంపించుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. తమ గ్రామంలో జరిగిన వింత చూడాలంటూ పోస్టులు పెడుతున్నారు. పీతను చూసేందుకు వచ్చిన వారంతా ఇలాంటి దాన్ని తాము కూడా ఇంతవరకు చూడలేదంటూ చెప్పుకుంటున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 10:05 PM

Advertising
Advertising
<