ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్..

ABN, Publish Date - Apr 09 , 2024 | 12:08 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు బైపాస్‌లోని పార్టీ కార్యకర్తకు చెందిన భవనంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి, ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

మూడు తరాలకు సరిపడా అప్పు!

ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని, రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

జగన్‌వి హత్యా రాజకీయాలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 12:08 PM

Advertising
Advertising