పిఠాపురంలో రైల్వే హాల్టు, ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పవన్ వినతి
ABN , Publish Date - Nov 27 , 2024 | 01:53 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్‌కల్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్లు నిలుపుదల చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. పిఠాపురం మున్సిపాల్టీ పరిధిలో సామర్లకోట, ఉప్పాడ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం వివరిస్తూ ఆర్‌వోబీ మంజూరు చేయాలని కోరారు.
పిఠాపురం, నవంబరు26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్‌కల్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్లు నిలుపుదల చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. పిఠాపురం మున్సిపాల్టీ పరిధిలో సామర్లకోట, ఉప్పాడ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం వివరిస్తూ ఆర్‌వోబీ మంజూరు చేయాలని కోరారు. ఢిల్లీలో మంగళవారం ఆయనను కలిసిన పవన్ పలు రైల్వే ప్రాజెక్టుల అవసరాలపై సుదీర్ఘంగా చర్చించారు. పిఠాపురం పట్టణ పరిధిలో వీవీ సెక్షన్, సామర్లకోట-ఉప్పాడ రోడ్డులో రైల్వే కిలోమీట ర్ 6.40 బార్30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబరు 431 బదులుగా ఆర్‌వోబీ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. నిరంత రం ట్రాపిక్ రద్దీని పరిష్కరించడానికి ఆ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటిని మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలన కల్పనకు ప్రధాన మంత్రి గతిశక్తి ప్రాజెక్టు ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి దేశం నలమూలల నుంచి భక్తులు వస్తున్నారని, పలు రైళ్లకు హాల్టు కల్పించాలని కోరారు. వాటిలో నాందేడ్ సంబల్‌పూర్ నాగవళి, నాందేడ్ విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల అవసరమని తెలిపారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఆయన వెంట ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, ఎంపీ బాలశౌరి ఉన్నారు.