ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నౌ..కాకినాడ!

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:24 AM

నౌ..కాకినాడ.. ఈ టైమ్‌ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్‌ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..

కాకినాడలో తయారైన భారీ షిప్‌

మారిటైం బోర్డు పాలసీతో తిరగనున్న దశ

షిప్‌ల నిర్మాణానికి అనువుగా కాకినాడ

షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌కు ప్రతిపాదన

సుదీర్ఘ సీఫ్రంట్‌తో ప్రయోజనం

పలు కంపెనీలూ ఆసక్తి

గతంలో కరువైన వైసీపీ ప్రోత్సాహం

మూడు కంపెనీలు వెనక్కు

ఈసురోమన్న నౌకా నిర్మాణ రంగం

కూటమితో చిగురిస్తోన్న ఆశలు

నౌ..కాకినాడ.. ఈ టైమ్‌ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్‌ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

షిప్‌ల తయారీ రంగానికి కేంద్రంగా కాకినా డను తీర్చిదిద్దేలా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీ లో నౌకా నిర్మాణ క్లస్టర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో కాకినాడలో వీటి తయారీ భవిష్య త్తులో భారీగా పుంజుకోబోతోంది. అటు రూ.300 కోట్లతో చిన్న, మధ్యతరహా నౌకల నిర్మాణానికి వీలుగా షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అధికా రులు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు కాకినాడలో చిన్న, మధ్యతరహా నౌకలు, బార్జీలు, టగ్‌ల తయారీకి ఊతం లభించనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం మారిటైం పాలసీ కింద నౌకల తయారీ క్లస ్టర్లకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించడం, అటు మారిటైం బోర్డు కార్యాలయం సైతం ఇక్కడే ఉండడంతో కాకినాడ దశ తిరగనుంది.

కాకినాడకు ఎప్పటి నుంచో పేరు..

విశాఖలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిం దుస్థాన్‌ షిప్‌యార్డు మినహా రాష్ట్రంలో నౌకల నిర్మాణం ఇంకెక్కడా లేదు. కానీ వీటి తయారీకి అత్యంత అనువైన వాతావరణం కాకినాడలోనే ఉంది. ఒకప్పుడు బ్రిటిష్‌ యుగంలో కోరంగి వద్ద నౌకల తయారీ, మరమ్మతులు జరిగేవి. అప్పుడే ఈ రంగంలో కాకినాడ పేరొందింది. వాస్తవానికి సుదీర్ఘ సాగర తీరం..దాన్ని ఆనుకుని యాంకరేజ్‌ పోర్టు వెంబడి వందల ఎకరాల భూములు ఉన్నాయి. నౌకల తయారీకి సముద్రానికి ఆను కుని విశాలమైన భూములు అవసరం. నౌకలు, బార్జీలు, టగ్‌లు తయారుచేసి ఆ పక్కనే ఉన్న సముద్రజలాల్లోకి వీటిని దించి పరీక్షలు చేస్తారు. ఈ అనుకూల వాతావరణం కాకినాడలోనే ఉంది. సీఫ్రంట్‌గా పిలిచే ఈ సౌకర్యం కాకినాడ జగన్నా థపురం బ్రిడ్జి నుంచి యాంకరేజ్‌ పోర్టు రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. వీటిని పోర్టు అధికారులు లీజుకు ఇస్తారు. ఇందులోనే శాన్‌ మెరైన్‌ ఏటా 20 వరకు చిన్నతరహా ఓడలను తయారుచేస్తోంది. అయితే కొత్త పాలసీ కింద కంపెనీలు వస్తే భవిష్యత్తులో నగరం నౌకల తయారీకి ప్రసిద్ధి చెందనుంది. అటు అధికారులు కొత్త నౌకా నిర్మాణ కేంద్రం ఈ ప్రాంతంలోనే అనువుగా ఉంటుందని తాజాగా గుర్తించారు.

నాడు పట్టించుకోని వైసీపీ

కాకినాడలో శాన్‌మెరైన్‌ అనే సంస్థ ఒక్కటే ఎన్నో ఏళ్లుగా చిన్న, మధ్యతరహా నౌకలు, బార్జీ లు, టగ్‌లు నిర్మిస్తోంది. గతేడాది ఏకంగా 8 వేల టన్నుల భారీ నౌకను నిర్మించింది. వచ్చే ఐదేళ్లలో మరో 25 వరకు నౌకలను నిర్మించి దేశవ్యాప్తంగా పలు కంపెనీలకు అందివ్వడానికి సిద్ధమవు తోం ది. మేట్‌ మెరైన్‌ అనే కంపెనీ పది ఎకరాల్లో వీటి తయారీకి సిద్ధమైనా గత ప్రభుత్వ ప్రోత్సాహం కరువై పక్కకుపోయింది. కేంద్రం ఒక పక్క రాయితీలు ప్రకటిస్తున్నా గత వైసీపీ సర్కారు మాత్రం ఈ రంగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మారిటైం పాలసీని ప్రకటించడంతో ఈ రంగం పుంజుకోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రధా నంగా నౌకల తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం కల్పి స్తామని ప్రకటించడంతో ఇప్పుడు కంపెనీలు దృష్టిసారించి కాకినాడకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అటు పాలసీ అమలుకు ఏపీ మారిటైం బోర్డును నోడల్‌ ఏజెన్సీగా నియమిం చింది. ఈ కార్యాలయం కాకినాడలో ఉండడంతో భవిష్యత్తులో నౌకా నిర్మాణం పుంజుకోవడానికి అ డుగులు పడుతున్నాయి. రూ.300 కోట్లతో ఇక్కడ నౌకా తయారీ కేంద్రం ఏర్పాటుకు అధికారులు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే భారీ పెట్టుబ డులు రానున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రా ల్లో ఉన్న హిందుస్థాన్‌, కొచ్చిన్‌, గోవా, మజ్‌గావ్‌ షిప్‌ యార్డులు 100 నుంచి 150 ఎకరాల విస్తీ ర్ణంలో నౌకలను నిర్మిస్తున్నాయి. కాకినాడలో ఐదె కరాల విస్తీర్ణంలోనే భారీ నౌకల తయారీకి సహ జసిద్ధ సీఫ్రంట్‌ వాతావరణం అనుకూలంగా ఉం ది. కానీ ప్రోత్సాహం లేక పెట్టుబడులు రాలేదు. నౌకల తయారీ క్లస్టర్లకు ప్రోత్సాహం కల్పిస్తున్నా మని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించడం తో కాకినాడ కేంద్రంగా ఈ రంగం ఎదిగేలా చే యడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.

వచ్చి.. వెళ్లిపోయాయి..

గతంలో కాకినాడలో నౌకల నిర్మాణం, మర మ్మతులకు షిప్‌యార్డును నిర్మించడానికి సిం గపూర్‌ కంపెనీ ముందుకు వచ్చింది. సీపోర్టులో కొంతకాలం కార్యకలాపాలు నిర్వహించింది. వివిధ దశల్లో రూ.1,725 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. కానీ సరైన ప్రోత్సాహం కరువవ డంతో ఇక్కడ యార్డును మూసేసింది. ఎల్‌ అండ్‌టీ కంపెనీ 2006లో కాకినాడలో షిప్‌ యార్డు నిర్మాణానికి ముందుకు వచ్చింది. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో చెన్నైకు వెళ్లిపోయింది. మరోపక్క 2020లో రూ.7కోట్ల కాకినాడ స్మార్ట్‌సిటీ నిధులతో జగన్నా థపురం సమీపంలో అధికారులు బోట్‌ బిల్డింగ్‌ యార్డు నిర్మించారు. ఇందులో ఒకేసారి 18 వరకు భారీ బోట్లు తయారుచేసే వసతులు సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో అది ఈసురోమంటోంది.

Updated Date - Dec 24 , 2024 | 01:24 AM