Election Results: మండపేటలో టీడీపీ రికార్డు.. వరుసగా నాలుగోసారి..
ABN, Publish Date - Jun 04 , 2024 | 04:08 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 130కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇదే సమయంలో టీడీపీ అనేక రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఘన విజయం సాధించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 130కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇదే సమయంలో టీడీపీ అనేక రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఘన విజయం సాధించారు. 42వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఘన విజయం సాధించారు. దీంతో ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన వ్యక్తిగా వేగుళ్ళ జోగేశ్వరరావు రికార్డు సృష్టించారు. 2008 నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆలమూరు నియోజకవర్గం మండపేట నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా మండపేట ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావును ఓడించేందుకు తోట త్రిమూర్తులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. జనసేన శ్రేణులు పూర్తిస్థాయిలో సహకరించడంతో ఈ నియోజకవర్గంలో వేగుళ్ళ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.
ప్రజల మనిషిగా..
మండపేట నియోజకవర్గం వేగుళ్ళ జోగేశ్వరరావుకు అడ్డాగా మారింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆయనకు పేరుంది. దీంతో వరుసగా నాలుగోసారి భారీ మెజార్టీతో విజయం సాధ్యమైంది. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ అధికారపక్షం అరాచకాలపై వేగుళ్ళ జోగేశ్వరరావు పోరాడుతూ వచ్చారు. గత ఐదేళ్లుగా పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ టీడీపీని నియోజకవర్గంలో మరింత బలోపేతమయ్యేందుకు కృషిచేశారు. వరుసగా నాలుగోసారి మండపేట నుంచి వేగుళ్ళ గెలుపొందడంతో ఆయనకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఉండొచ్చనే చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది.
Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 04 , 2024 | 04:08 PM