ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:46 PM

రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

న్యూఢిల్లీ, నవంబర్ 26: నాలుగు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీన ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో ఖాళీ అయిన ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

Also Read: మున్సిపల్ కమిషనర్‌ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం


డిసెంబర్ 3వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామంది. డిసెంబర్ 10వ తేదీ.. అభ్యర్థి నామినేషన్ వేసేందుకు చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇక డిసెంబర్ 11వ తేదీన అభ్యర్థి నామినేషన్ పరిశీలన ఉంటుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 13వ తేదీ.. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని తెలిపింది.


డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం 5.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.


ఇక ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసిన విషయం విధితమే. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.


గత జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ముగ్గురు వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. అది కూడా ఎంతగా అంటే.. ప్రతిపక్ష హోదా సైతం ఆ పార్టీకి దక్కలేదు. కేవలం 11 స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. అదీకాక వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన.. అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీలోని అగ్రనేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అంతా గుర్రుగా ఉన్నారు. ఆ క్రమంలో పార్టీ ఓటమి పాలైన నాటి నుంచి పలువురు వైసీపీని వీడుతున్నారు.


అలా మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో రాజ్యసభ స్థానానికి సైతం రాజీనామాలు చేశారు. అనంతరం వీరిద్దరు... సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే గతంలో హైదరాబాద్‌లోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య గెలుపొందిన సంగతి అందరికి తెలిసిందే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 26 , 2024 | 05:01 PM