ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: వైసీపీలో చేరిన విజయవాడ బీజేపీ నేత వంగవీటి నరేంద్ర

ABN, Publish Date - Mar 20 , 2024 | 05:58 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Election 2024), లోక్‌సభ ఎన్నికల (Lok Sabha polls) నేపథ్యంలో రాజకీయ నేతల జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ నుంచి ఎక్కువ వలస కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడకు చెందిన బీజేపీ నేత వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలో చేరారు.

విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Election 2024), లోక్‌సభ ఎన్నికల (Lok Sabha polls) నేపథ్యంలో రాజకీయ నేతల జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ నుంచి ఎక్కువ వలస కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడకు చెందిన బీజేపీ నేత వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలో చేరారు.

టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆయన వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. స్వలాభం కోసమే టీడీపీ ప్రభుత్వం గతంలో పనిచేసిందని, పేదల కోసం పని చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఐదేళ్లలో సీఎం జగన్ పేదలకు సంక్షేమ పథకాలు అందించారని, వైఎస్ జగన్నే ప్రజలు తిరిగి సీఎంగా చేస్తారని అన్నారు. వైఎస్ జగన్ ఆశయాలు నెరవేర్చేందుకు తాను సిద్ధమని వంగవీటి నరేంద్ర తెలిపారు. రాజశేఖరరెడ్డి కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆయన అన్నారు. తన సోదరుడు వంగవీటి రాధా కిందటిసారి వైఎస్సార్‌సీపీని వీడి తప్పు చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడింది ప్రజల కోసం కాదని, వారి స్వార్థం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 20 , 2024 | 05:58 PM

Advertising
Advertising