ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: కూటమికే పట్టం..!! చంద్రబాబు ధీమా

ABN, Publish Date - May 14 , 2024 | 04:20 AM

తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.

chandrababu- pawan kalyan

ఎవరి ధీమా వారిదే

మాకే పట్టం.. టీడీపీ కూటమి ధీమా

ప్రజల్లో తిరుగుబాటు.. అది చూశాకే వైసీపీ దాడులు: చంద్రబాబు

కూటమిదే భారీ విజయం.. మార్పు కోసం తీర్పు ఇచ్చారు: పవన్‌

మాకే ఓట్ల వెల్లువ.. అంతటా ప్రభుత్వ సానుకూలతే: సజ్జల

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. సోమవారం జరిగిన పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై ఈ పార్టీలు సమాచారం సేకరించాయి. దీంతోపాటు తమ నేతలు, ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం రోజంతా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వార్‌ రూమ్‌లోనే ఉండి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అన్ని జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా పరిస్థితి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మనోగతం తెలుసుకోవడానికి టీడీపీ నాయకత్వం కొన్ని బృందాలను నియోగించింది. వారి నుంచి వస్తున్న సమాచారాన్ని కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు విశ్లేషించి జిల్లాల నేతలను అప్రమత్తం చేశారు. ‘పోలింగ్‌ సరళి మాకు పూర్తి సంతృప్తి కలిగించింది. మేం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయబోతున్నాం.

కూటమి అధికారంలోకి రాబోతోంది’ అని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తాము ఊహించినదానికన్నా బలంగా వ్యతిరేకత ఉందని, అందుకే ఓటింగ్‌కు ప్రజలు వెల్లువలా వచ్చారని అభిప్రాయపడ్డారు. ‘ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుండగా.. దానికి ముందే అనేక పోలింగ్‌ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు వచ్చి బారులు తీరారు. గతంలో ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు ప్రజల్లో ఉన్న కసిని ఇది ప్రతిబింబించింది. ఎండను, రద్దీని లెక్కచేయకుండా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. నగరాలు, పట్టణాల్లో చదువుకున్నవారు ఓటింగ్‌కు రారన్న ప్రచారం నిజం కాదని ఇక్కడ తేలిపోయింది. ప్రత్యేకించి యువత ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పెద్ద ఎత్తున కనిపించారు. ఎక్కడెక్కడో చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఈసారి ఓట్లు వేసి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ప్రతిబింబించాయి’ అని ఆ పార్టీ జిల్లా సమన్వయకర్త ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో రాజంపేట, నంద్యాల తప్ప మిగిలిన 23 సీట్లలో తాము ఆధిక్యం సాధించే అవకాశం ఉందని పోలింగ్‌ తర్వాత టీడీపీ నేతలు జరిపిన అంతర్గత విశ్లేషణ సూచించినట్లు చెబుతున్నారు. అరకు (ఎస్టీ) లోక్‌సభ స్థానం పరిధిలోని ఒక ఎస్సీ, ఆరు ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిపై టీడీపీ నాయకత్వం నిన్నటివరకు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ సోమవారం పోలింగ్‌ చూశాక తర్వాత ఈ ఏడింటిలో మెజారిటీ సీట్లు సాధించగలమని నమ్మకం ఏర్పడిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉపాధి దెబ్బ తిన్న భవన నిర్మాణ కార్మికులు వంటి వర్గాలు, ఆదాయ మార్గాలు దెబ్బ తిన్న చిన్న వ్యాపారులు, చేతివృత్తులవారు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారు, ఉద్యోగాలు రావడం లేదని నిరాశలో ఉన్న యువత, వారి తల్లిదండ్రులు, రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందని బాధపడుతున్నవారు, కరెంటు బిల్లులు, పన్నుల భారాలతో కుంగిపోయిన వర్గాలు, వైసీపీ అరాచక పాలనకు భంగపడినవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. పఽథకాల లబ్ధిదారులు తమ వెంటే ఉన్నారన్న జగన్‌ అండ్‌ కో నమ్మకం కూడా క్షేత్ర స్థాయిలో నిలబడలేదు. కూటమి మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండడం తదితర కారణాలతో వారిలో కూడా చీలిక వచ్చింది. బీజేపీతో పొత్తు కారణంగా ముస్లింలు టీడీపీకి దూరమై పూర్తిగా వైసీపీకి మద్దతుగా నిలుస్తాయన్న వాదన కూడా నిలవలేదు. వారు అత్యధికంగా టీడీపీ అభ్యర్థులకే ఓట్లేశారు’ అని ఇంకో టీడీపీ ముఖ్యుడొకరు విశ్లేషించారు. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగదన్న వైసీపీ ఆశలు కూడా అడుగంటాయని, పూర్తి స్థాయిలో ఓట్ల బదిలీ జరిగిందని తెలిపారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న కసి..

రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న కసి ప్రతి చోటా ఓటర్లలో కనిపించిందని చంద్రబాబు తెలిపారు. ‘హింసను ప్రేరేపించి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసి ఓటర్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకత్వం ప్రయత్నించింది. సోమవారం తెల్లవారుజామునే పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఏజెంట్ల కిడ్నాపుతో మొదలు పెట్టారు. ఆ తర్వాత మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, గురజాల, పెనమలూరు తదితర చోట్ల తమ కార్యకర్తలతో దాడులు చేయించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీ కార్యకర్తలు వమ్ము చేశారు. వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకత్వం హింసకు ఒడిగట్టింది’’ అని అన్నారు.

నేడు వారాణసీకి వెళ్తున్న బాబు

చంద్రబాబు మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీకి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. అక్కడ ప్రధాని మోదీ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి రావాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆహ్వానం పంపడంతో ఆయన వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాత్రికి తిరుగుపయనమవుతారు.

కొత్త చరిత్రకు శ్రీకారం ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయి

కుట్రలను కూటమి అడ్డుకుంది: చంద్రబాబు

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలను అందరూ చూస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి తమ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. వరుసగా ‘ఎక్స్‌’లో ట్వీట్లు కూడా చేశారు. ‘రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సోమవారం ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో చైతన్యం చూశాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి, ప్రజాస్వామ్య పాలనను సాధించుకోవాలనే కసి, పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చిన ప్రతి ఓటరులోనూ కనిపించింది. మహాసంకల్పంతో ఓటేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, ఎండవేడి, ప్రయాణ బడలికను ఓర్చుకుని, పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఓటమి భయంతో భయోత్పాతం సృష్టించి పోలింగ్‌ శాతం తగ్గించడానికి వైసీపీ నేతలు హింసకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం. రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచిరోజులే’ అని పేర్కొన్నారు. జగన్‌ అరాచక పాలనకు గుడ్‌బై చెప్పడానికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెల్లవారుజాము నుంచే పో లింగ్‌ స్టేషన్ల ముందు ఏర్పడిన క్యూ లైన్లు ప్రపంచానికి చాటాయని వ్యాఖ్యానించారు. ఓటమి కళ్లకు కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డార న్నారు. ఆ దాడుల్ని కూటమి అడ్డుకుందన్నారు..

Updated Date - May 14 , 2024 | 11:42 AM

Advertising
Advertising