ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: పురందేశ్వరిపై వైసీపీ మరో కుట్ర

ABN, Publish Date - Apr 10 , 2024 | 08:03 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ బ్యాచ్‌ మరో కుట్ర చేసింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆమె ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి వెల్లడించినట్లు వీడియోలు సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తామన్నట్లు ప్రచారం

దానికి బాబు, పవన్‌ల మద్దతు ఉందంటూ ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ లోగోతో వైరల్‌

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ బ్యాచ్‌ మరో కుట్ర చేసింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆమె ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి వెల్లడించినట్లు వీడియోలు సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు అన్యాయంగా కట్టబెట్టిందని పురందేశ్వరి ఆరోపించినట్లు, కూటమి గెలిచిన వెంటనే ఆ రిజర్వేషన్ల రద్దుపై తొలి సంతకం చేసేందుకు చంద్రబాబు, పవన్‌ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి ప్రకటించినట్లు ఇతర వెబ్‌సైట్ల లోగోలతో వైరల్‌ చేశారు.


వైసీపీ నేతల అక్రమాలపై గట్టిగా పోరాటం చేస్తోన్న పురందేశ్వరి లిక్కర్‌, ల్యాండ్‌, మైన్‌ తదితర అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుచేశారు. ఇటీవల విశాఖ పోర్టులో సీబీఐ తనిఖీలు చేసిన డ్రగ్స్‌ వ్యవహారంలోనూ ఆమెకు సంబంధం ఉందంటూ జగన్‌ మీడియా తప్పుడు కథనాలు ప్రచురించి ప్రసారం చేసింది. దీంతో ఆమె పరువునష్టం నోటీసులు ఇచ్చారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదేపదే ఫేక్‌ న్యూస్‌ సృష్టించి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఈసీకి విజ్ఞప్తిచేశారు. కాగా, ఇదే అంశంపై బీజేపీ ఏపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ బాజీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రతిసారి ఎన్నికలు రాగానే రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంది. నకిలీ వార్తలపై సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేస్తాం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

కొడుకు మృతదేహంతో 8 కి.మీ. నడక

Janasena Candidates: చివరి అభ్యర్థిని ప్రకటించేసిన జనసేన.. పాలకొండ అభ్యర్థి ఎవరంటే

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 08:05 AM

Advertising
Advertising