AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 40 మందితో స్టార్ క్యాంపెయినర్లు
ABN, Publish Date - Apr 25 , 2024 | 10:03 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఉన్నారు. వీరితోపాటు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్, మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా చోటు లభించింది.
AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చిన నేతలకు స్టార్ క్యాంపెయినర్లుగా అవకాశం ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజు దృష్టిలో ఉంచుకొని ఏపీకి సమయం కేటాయించాలని హైకమాండ్ స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రులు కూడా ఏపీలో ప్రచార బరిలో నిమగ్నం అవుతారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఏపీతోపాటు తెలంగాణ ఎన్నికలను సమన్వయం చేసుకొని ముఖ్య నేతలు ప్రచారం చేసే అవకాశం ఉంది.
AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
Read Latest Andhra Pradesh News And Telugu News
Updated Date - Apr 25 , 2024 | 10:04 PM