ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: చంద్రబాబు, పవన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై బీజేపీ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:30 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్‌గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...

టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్‌గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. వీటన్నింటినీ ఓర్పుగా చూసిన ఏపీ బీజేపీ.. మేనిఫెస్టోపై వారందరికీ దిమ్మతిరిగేలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది.


ట్వీట్ సారాంశమిదే..

టీడీపీ, జనసేన మేనిఫెస్టోని స్వాగతిస్తున్నట్లుగా బీజేపీ (AP BJP) అధికార ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో - 2024 ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది’ అని అధికారిక ట్విట్టర్ పేజీలో బీజేపీ ప్రకటించింది. ఈ ఒక్క ట్వీట్‌తో ఇప్పటి వరకూ ఇష్టానుసారం మాట్లాడిన వైసీపీ నేతలు, విమర్శకుల నోరు మూయించినట్లయ్యింది. కూటమి మేనిఫెస్టోపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పైత్యం ప్రదర్శిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇప్పటి వరకూ ప్రజల్లో, టీడీపీ, జనసేన శ్రేణుల్లో నెలకొన్న అనుమానాలు సైతం పటాపంచలయ్యాయి. ఇప్పుడీ ట్వీట్‌పై వైసీపీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపించుకుంటున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 10:33 PM

Advertising
Advertising