AP Elections: పంపకాలకే ప్రాధాన్యం.. రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నావ్ జగన్..!
ABN, Publish Date - Apr 27 , 2024 | 06:29 PM
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి.. గొప్పగా పరిపాలించామని చెప్పుకుంటున్నారు. ఐదేళ్ల పరిపాలన చూసి.. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధిలో వెనకపడిందనే ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలను టార్గెట్ చేసి కక్షసాధింపు చర్యలకే ఎక్కువ సమయం కేటాయించారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి.. గొప్పగా పరిపాలించామని చెప్పుకుంటున్నారు. ఐదేళ్ల పరిపాలన చూసి.. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధిలో వెనకపడిందనే ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలను టార్గెట్ చేసి కక్షసాధింపు చర్యలకే ఎక్కువ సమయం కేటాయించారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం అప్పుల మయం చేసిందనేది బహిరంగ రహస్యం. రాష్ట్ర సంపదను పెంచకుండా అప్పులపై ఆధారపడి రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు నెట్టుకొచ్చారు. ఐదేళ్ల తర్వాత లక్షల కోట్ల అప్పులే మిగిలాయి. ఐదేళ్ల సమయం అయిపోయింది. పరిపాలనలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వాటినుంచి గుణపాఠాలు నేర్చుకుని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశించారు. కానీ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి.
వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో 2024లో రాష్ట్ర అభివృద్ధి ఊసే లేదు. సంక్షేమ పథకాల పేరుతో గత ఐదేళ్లలో ఎంత డబ్బు పంచామనేది పేర్కొంటూ.. రానున్న ఐదేళ్లు అవే పథకాలు కొనసాగిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపర్చారు. దీంతో ఐదేళ్ల పాలనలో ఎదురైన అనుభవాల నుంచి ఎటువంటి పాఠం జగన్మోహన్ రెడ్డి నేర్చుకోలేదనేది స్పష్టమవుతోంది.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
తీరుమార్చుకోని జగన్..
మొదటిసారి ముఖ్యమంత్రి.. కొంత అనుభవం సంపాదించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. కొంత సమయం పడుతుందనేది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలామంది నుంచి వచ్చిన మాట. అలా ఐదేళ్లు గడిచిపోయింది. కానీ ఆయన ఆలోచన తీరు మారలేదనేది వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత రాష్ట్రప్రజలకు అర్థమవుతోంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులకు అనుగణంగా మేనిఫెస్టో రూపొందిస్తారు. రాష్ట్రంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా.. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. పారిశ్రామికంగా ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందిన ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయనేదానికి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటైన కియా పరిశ్రమ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటును పూర్తిగా మరిచిపోయింది. టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ ప్రభావం రాష్ట్రంపై పడింది. ఎంతో మంది జగన్ తీరును విమర్శించినా.. ఈ మేనిఫెస్టోలో సైతం ఉచితాలకే ప్రాధాన్యత ఇస్తూ.. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.
వైసీపీ తప్పులతో..
వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ అధోగతిపాలవుతుందనే చర్చ నడుస్తోంది. ముందుచూపు లేకుండా, సంపదను పెంచకుండా.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో భవిష్యత్తు తరాల జీవితాలు అంధకారమవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆర్థిక నిపుణులు హెచ్చరించినా వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదు. దీంతో ప్రజలు సైతం జగన్ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి అధికారం ఇస్తే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం జరుగుతుదంనే ఆలోచనలో ఏపీ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మేనిఫెస్టో ఓట్లు తెచ్చి పెడుతుందా.. అధికారాన్ని దూరం చేస్తుందా అనేది జూన్4న తేలనుంది.
YSRCP Manifesto 2024: మళ్లీ గెలిస్తే.. అమ్మ ఒడి పెంపు: సీఎం జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telugu News Here
Updated Date - Apr 27 , 2024 | 06:47 PM