ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: షాకింగ్.. పోస్టల్ బ్యాలెట్‌ పత్రంపై ఇలా చేసుంటే ఆ ఓట్లు చెల్లవు!

ABN, Publish Date - May 29 , 2024 | 10:53 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ ఓటు వేయకపోయినా, ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేసినా అది చెల్లుబాటు కాదు...

అమరావతి/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections 2024) పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ ఓటు వేయకపోయినా, ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేసినా అది చెల్లుబాటు కాదు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను గుర్తు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన ఆదేశాలు మంగళవారం జిల్లా కేంద్రానికి చేరాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపరు అనుమానాస్పద పేపర్‌గా గుర్తించినా, చిరిగిపోయినా చెల్లదు. బ్యాలెట్‌ అని నిర్ధారించడానికి అవకాశం లేని సమయంలో, ఇంకా రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన కవర్‌-బి లేకపోతే, ఓటరు గుర్తించే విధంగా ఆ పత్రంపై ఏమైనా గుర్తులు, చేతిరాతలున్న సందర్భాల్లో అట్టి పోస్టల్‌ బ్యాలెట్‌ను తిరస్కరిస్తారు.


తిరస్కరణ ఇలా..!

ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఉద్యోగి ఓటేసే సమయంలో డిక్లరేషన్‌ ఫారం ఒక వేళ కవర్‌-బిలో లేకపోతే, డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ లేదా అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం లేకపోయినా, ఫారం-13ఎ, ఫారం- 13బిలో బ్యాలెట్‌ సీరియల్‌ నెంబర్లు వేర్వేరుగా ఉన్నట్లు తెలిస్తే బ్యాలెట్‌ తెరవకుండానే తిరస్కరించవచ్చు. డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంపు లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ధ్రువీకరణ అధికారి సంతకం మీద అనుమానం వస్తే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారి ఏర్పాటు చేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్ల వివరాలతో సరిపోల్చి తగు నిర్ణయం తీసుకోవాలి.


ఇవి తప్పనిసరి..!

పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ వెనుక రిటర్నింగ్‌ అధికారి కానీ, ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్‌ పేపర్‌ వెనుక సంతకం విషయంలో ఏదైనా సందేహం వస్తే సీరియల్‌ నెంబరు ప్రకారం కౌంటర్‌ ఫైల్‌ పరిశీలించి అది నిజమైన బ్యాలెట్‌ పత్రమా..? కాదా..? అని నిర్ధారించుకోవాలి. ఒకవేళ సందేహం వస్తే తిరస్కరించవచ్చు. కవర్‌-13బి మీద సంతకం లేదన్న కారణంగా ఓటును తిరస్కరించరాదు. డిక్లరేషన్‌ ఫారం-13ఎ ప్రకారం ఓటరును గుర్తించాలి. ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఈటీపీబీఎంఎస్‌)ను చక్కగా నిర్వహించే దిశలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని సీఈవో పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2024 | 10:55 AM

Advertising
Advertising