ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results 2024: బూతుల మంత్రులకు చెక్.. తగిన బుద్ధి చెప్పిన ఓటర్లు!

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:14 PM

అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.

Kodali Nani, Ambati Rambabu

అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. వ్యక్తిగత జీవితాలపై దాడి చేశారు. వారందరూ తాజా ఎన్నికల్లో ఓటమి పాలు కావడం గమనార్హం.


టీడీపీ నేతలపై, పవన్ కల్యాణ్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన కొడాలి నాని, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ దారుణ ఓటములు ఎదుర్కొన్నారు. మచిలీపట్నం నుంచి బరిలోకి దిగిన పేర్ని నాని తనయుడు క్రిష్ణమూర్తి కూడా ఓటమిపాలయ్యారు. ఇక, నగరి నుంచి బరిలోకి దిగిన ఆర్కే రోజా, గాజువాక నుంచి బరిలోకి దిగిన గుడివాడ అమర్‌నాథ్ కూడా ఓటములు ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కూడా అభ్యంతరకర భాషతో పవన్ కల్యాణ్, చంద్రబాబుపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు టీడీపీ కూటమికి భారీ అధిక్యాన్ని అందించాయి. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన వైసీపీ ఎన్నికల్లో కేవలం 10 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కేలా కనిపించడం లేదు. టీడీపీ కూటమి 160 పైచిలుకు స్థానాలను సొంతం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.

Updated Date - Jun 04 , 2024 | 04:14 PM

Advertising
Advertising