AP Elections: ఎన్నికల వేళ ఉద్యోగులకు.. జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్!
ABN, Publish Date - May 02 , 2024 | 03:38 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి..
అమరావతి, మే 2: ఎన్నికల సమయంలో (AP Elections 2024) ఏపీ ప్రభుత్వం (AP Government) ఉద్యోగులకు కరెంట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో.. అపార్టమెంట్లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. వీరు ఉంటున్న ప్లాట్‌ల విద్యుత్ బిల్లులు పరిమితికి మించి వస్తుండడంతో బిల్లులు చెల్లించాలని జీఏడీ అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది.
Elections 2024: ఎన్నికల ముందు రోజా బిగ్ షాక్.. గెలుపు కష్టమేనా..!?
Bengaluru: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
ఈ క్రమంలో పరిమితికి మించి 2లక్షల 79వేల 23 రూపాయలు విద్యుత్ వాడిన ఉద్యగులకు జీఏడీ అకామిడేషన్ విభాగం షాక్ ఇచ్చింది. ఇచ్చిన పరిమితికి మించి విద్యుత్ వినియోగించుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని స్పష్టం చేసింది. పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ప్లాట్‌లలో ఉన్న ఉద్యోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో వారి విద్యత్ కనెక్షన్ తొలగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్వీస్ అసోషియేషన్‌లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ రావడం ఉద్యోగులకు షాక్ గురయ్యేలా చేసింది.
ఇవి కూడా చదవండి...
AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్
Father: తండ్రి కాదు కసాయి.. ఆరేళ్ల బాలుడిని ఏం చేశాడో తెలుసా..?
Read latest AP News And Telugu News
Updated Date - May 03 , 2024 | 06:15 PM