మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Apr 27 , 2024 | 10:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు పెన్షన్ పంపిణీపై ఎంత హైడ్రామా నడుస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదేశాలు పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్.. కుదరదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో అసలు పెన్షన్ల కథేంటో తెలియని పరిస్థితి.! అయితే తాజాగా పెన్షన్ల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది..

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు పెన్షన్ పంపిణీపై ఎంత హైడ్రామా నడుస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదేశాలు పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్.. కుదరదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో అసలు పెన్షన్ల కథేంటో తెలియని పరిస్థితి.! అయితే తాజాగా పెన్షన్ల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. కాగా.. ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి తెలిపిన సీఎస్.. ఏప్రిల్‌లో చేసినట్లే చేస్తామని వెల్లడించారు. దీంతో తాజాగా క్లియర్ కట్‌గా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.

Attack On Jagan: గులకరాయిలో రహస్యమేంటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!?



ap-pensions.jpg

తేల్చిచెప్పిన ఈసీ!

పెన్షన్లు సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి- 30న జారీ చేసిన విషయాన్ని ఈసీ గుర్తు చేసింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్‌‌కు తేల్చిచెప్పింది. దీంతో పాటు.. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఎక్కడా వలంటీర్లను వాడుకోవద్దని.. ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సీఎస్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల కమిషన్.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

Read More Andhra Pradesh And Telugu News

Updated Date - Apr 27 , 2024 | 10:16 AM

Advertising
Advertising