AP Elections: నెక్స్ట్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!!
ABN, Publish Date - May 06 , 2024 | 01:40 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు వారం రోజులు ముందు కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం కింద ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో కీలక అధికారులుగా ఉన్న కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీతో సహా విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అధికారుల పనితీరుతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు వారం రోజులు ముందు కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం కింద ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో కీలక అధికారులుగా ఉన్న కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీతో సహా విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అధికారుల పనితీరుతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. మరోవైపు కొంతమంది ఐపీఎస్ అధికారులతో పాటు డీఎస్పీ, జిల్లా అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ.. సీఎస్, డీజీపీలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఆదివారం రోజు ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెక్స్ట్ ఎవరు..? అనేదానిపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం!
నెక్స్ట్ వికెట్ ఈయనేనా..?
కేంద్రఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వ్యవస్థలపై నమ్మకం పెంచే విధంగా ఉందని, అయితే కొంత ఆలస్యం జరిగిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా ఆయన పనితీరు రాష్ట్రప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా ఉందని విపక్షాలు చాలా రోజులుగా ఆరోపిస్తున్నాయి. సీఎస్‌పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశామని, తక్షణమే ఎన్నికల సంఘం స్పందించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం లేదని, ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ నాయకుడిలా పనిచేస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జవహర్ రెడ్డిపై అనుమానాలు..
ఏపీ సీఎస్ పనితీరుపై విపక్షాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయి. పెన్షన్ల విషయంలో జవహర్ రెడ్డి విభిన్న ప్రకటనలు, ఆయన పనితీరు అనుమానాస్పదంగా ఉందని, ప్రజలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయని, సీఎం జగన్ ఆదేశాలనే ఇప్పటికీ ఆయన పాటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో జవహర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. డీజీపీపై చర్యలు తీసుకోవడంతో నెక్ట్స్ సీఎస్‌పై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎస్ పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడ్రోజుల్లో సీఎస్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు మరో ఏడ్రోజులు మాత్రమే ఉండటంతో ఈ లోపు ఏమైనా జరగొచ్చని టాక్ నడుస్తోంది.
AP Elections: జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu news
Updated Date - May 06 , 2024 | 02:07 PM