Lok Sabha Polls 2024: మాధవీలతపై ఈసీ సీరియస్.. కేసు నమోదు.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!
ABN, Publish Date - May 13 , 2024 | 02:56 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమె ప్రవర్తనపై ఎంఐఎం అభ్యంతరం తెలపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమె ప్రవర్తనపై ఎంఐఎం అభ్యంతరం తెలపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళలను అవమానించారని ఎన్నికల సంఘానికి ఎంఐఎం ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీలో ఓ పోలింగ్ కేంద్రంలో పరిశీలనకు వెళ్లిన మాధవీలత.. ఓటర్ ఐడీ చెక్ చేస్తూ ముస్లిం మహిళలను బుర్కా తొలగించాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి.దీంతో మాధవీలతపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Lok Sabha polls 2024: ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలను తనిఖీ చేసిన మాధవీ లత..
మాధవీలత వీడియోపై సీఎం రేవంత్ స్పందన..
బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో గురించి మీడియా సీఎం రేవంత్‌ను అడగ్గా.. ఆయన స్పందించారు. తాను ఆ వీడియో చూడలేదని, ముస్లిం ఓటర్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలన్నీ ఒవైసీ విజయానికి దోహదపడతాయన్నారు. మాధవీలత చర్యలతో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ తెలిపారు.
LoKSabha Elections: పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest Telangana News and Telugu News
Updated Date - May 13 , 2024 | 02:56 PM