ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: రామచంద్రయాదవ్‌పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు.. హైకోర్టు విచారణ

ABN, Publish Date - May 08 , 2024 | 04:46 PM

బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ (Ramachandra Yadav)పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)లో రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని హైకోర్టులో ఆయన పిటీషన్ వేశారు.

Ramachandra Yadav

అమరావతి: బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ (Ramachandra Yadav)పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)లో రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని హైకోర్టులో ఆయన పిటీషన్ వేశారు. ఈ కేసులపై హైకోర్టు ఈరోజు(బుధవారం) విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులపై హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.


CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

అయితే రామచంద్రయాదవ్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రామచంద్రయాదవ్‌పై కేసులు పెట్టీ వేధిస్తున్నారని పిటీషనర్ చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకొనివ్వకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని హైకోర్టుకు రామచంద్రయాద్ తరఫున పిటీషనర్ తెలిపారు. పోలీసులు ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుపడితే ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు.


రామచంద్రయాదవ్‌ను ప్రచారం చేసుకోనివ్వకుండా ఎలా అడ్డుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు కొంతమంది నేతల సిఫార్సులకు లొంగిపోతున్నారని ఉమేష్ చంద్ర చెప్పారు. తాము సీఆర్పీసీలోని 41A నిబంధనలను ఫాలో అవుతామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను రికార్డు చేసి పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

Rahul Gandhi: ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

AP News: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 08 , 2024 | 04:51 PM

Advertising
Advertising