Chandrababu: పచ్చి మోసగాడు ఈ జలగ.. రంగుల పిచ్చోడు ఇళ్లు కట్టించాడా?
ABN, Publish Date - May 10 , 2024 | 01:30 PM
ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు.
కాకినాడ: ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజును ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌పై రఘురామ మామూలుగా పోరాటం చేయలేదన్నారు. రఘురామకు న్యాయం చేయడం కోసమే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామన్నారు.
AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!
ఫ్యాన్‌ను మళ్ళీ తీసుకు వస్తే, మీకు ఉరి వేస్తాడు.
జగన్ ను గెలిపిస్తే ., మీ ప్రతీ ఇంటికి గొడ్ఢలి వస్తుంది.. గొడ్డలి పోటు మీకు అవసరమా? మద్యం పేరుతో కోట్లు దోచేశారు. నకిలీ మద్యం తాగితే మీకు అనారోగ్యం వస్తుంది. రాష్ట్రంలో కుంభకోణాలే కుంభకోణాలు. ఇసుకను దోపిడీ చేస్తున్నారు. మద్యం పేరుతో దోపిడీ చేశారు. మా మహిళల మంగళసూత్రాలు కొట్టేశారు. మీ భూములు కొట్టేయడానికి ప్లాన్ వేశాడు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఉంటుంది. మీ భూములు మీవి కావు.. జగన్‌వి అంట.. ఆ భూములు తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడు. ఫ్యాన్‌ను మళ్ళీ తీసుకు వస్తే, మీకు ఉరి వేస్తాడు. అది మీకు అవసరమా..? మీరు వైసీపీకి ఉరి వేయాలి.. ఫ్యాన్‌కు ఉరి వెయ్యండి. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. పచ్చి మోసగాడు ఈ జలగ అవునా కాదా?మద్యపాన నిషేధం, సీపీయస్ రద్దు చేస్తానన్నాడు.. చేయలేదు. 30 లక్షల ఇళ్లు కడతానన్నాడు.. రంగుల పిచ్చోడు ఇళ్లు కట్టించాడా?
Lok Sabha polls 2024: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..
మీరు సిద్ధమైతే.. రాష్ట్రంలో సైకో పాలన పోవాలి..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తాం. అమరావతి రాజధానిని నాశనం చేశాడు. ప్రత్యేక హోదా తెస్తానని తీసుకురాలేదు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఆయన ఒక హీరోనే. కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. గంజాయిని వంద రోజుల్లోనే అణిచివేస్తాం . అందరికీ మంచినీళ్లు ఇవ్వాలని ఆశించి జలజీవన్ స్రవంతిని తీసుకు వచ్చాం. దానిలోనూ అవినీతికి పాల్పడ్డాడు. ఆక్వారంగాన్ని నాశనం చేశాడు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే, యూనిట్ 1.50 రూపాయలకే కరెంటు ఇస్తాం. రేపే ప్రచారానికి చివరి రోజు. మీరు సిద్ధమైతే.. రాష్ట్రంలో సైకో పాలన పోవాలి.. ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం ఏడు గంటల లోపే ఓటు హక్కు వినియోగించుకోండి . వైసీపీకి ఓటు వేస్తే, మీకు మీరు ఉరి వేసుకున్నట్లే..
ఇవి కూడా చదవండి..
AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్ ‘వ్యూహం’
AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - May 10 , 2024 | 01:30 PM