ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: అల్లదిగో.. విశాఖ !

ABN, Publish Date - Apr 28 , 2024 | 03:22 AM

పరిపాలనా రాజధానిపై జగన్నాటకం ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో వైసీపీ పూలు ‘అమరావతి’ని నాశనం చేసి మూడుముక్కలాట

  • పరిపాలనా రాజధానిపై జగన్నాటకం

  • ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో వైసీపీ పూలు

  • ‘అమరావతి’ని నాశనం చేసి మూడుముక్కలాట

నాలుకా.. తాటిమట్టా..?

  • 2022 ఉగాదికి విశాఖ నుంచి సీఎం జగన్‌ (CM JAGAN ) పరిపాలన ప్రారంభిస్తారు. మీడియా వారు రాసుకోండి’ అంటూ అప్పట్లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ చేసి మరీ చెప్పారు. ఆ తర్వాత వైసీపీ పెద్దలు మే, జూలై, సెప్టెంబరు అన్నారు. ఈ గడువులన్నీ ముగిశాయి. కానీ అంతా.. తూచ్‌! అన్నట్టు.. ఆ ఏడాది ఉగాది పోయి మరో రెండు ఉగాది పండగలు కూడా వచ్చాయి.

  • 2023లోనూ ఇదిగో విశాఖ నుంచి.. అంటూ వైసీపీ పెద్దలు నానా హంగామా చేశారు. దసరా, ఆ తర్వాత క్రిస్మస్‌.. అంటూ డెడ్‌లైన్లు ప్రకటించారు. కానీ జగన్‌ విశాఖకు కాపురానికి వెళ్లిందీ లేదు.. అక్కడి నుంచి పాలన ప్రారంభించిందీ లేదు.

  • మంత్రులు, వైసీపీ పెద్దలు చాలదన్నట్టు.. ‘విశాఖ’పై సీఎం జగన్‌ కూడా స్వయంగా ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానని 2023 మార్చిలో విశాఖ పెట్టుబడుల సదస్సులోనూ, దేశ రాజధాని ఢిల్లీలోనూ చెప్పారు. తాడేపల్లి ప్యాలె్‌సలో తనను కలసిన తెలుగు సినిమా అగ్రహీరోలకూ ఇదే మాట చెప్పారు. అంతేగాక.. ‘మీరూ విశాఖకు రండి.. స్థలాలు ఇస్తాను’ అంటూ ఆశపెట్టారు. సీన్‌ కట్‌ చేస్తే.. జగన్‌ మాట కూడా ఉత్తుత్తే!

ఇదీ అసలు నిజం

చంద్రబాబు హయాంలో ప్రారంభించిన అమరావతి రాజధాని

నిర్మాణాన్ని అటకెక్కించడం.. మూడు రాజధానులంటూ ప్రాంతాల

మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం.. విశాఖలోని వనరులను

దోచుకోవడం’.. ఇదీ జగన్‌ అండ్‌ కో ప్రకటనల వెనుక ఉన్న అసలు

ఉద్దేశం. రాజకీయ క్రీడలో చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా

చేసేశారు.

YSRCP Manifesto 2024: భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ సాక్షిగా..!


విశాఖ నుంచి త్వరలో జగన్‌ పాలనంటూ మూడేళ్లుగా మంత్రులు, నేతల ప్రకటనలు

2022 ఉగాదికే వస్తారని గుడివాడ వెల్లడి.. తర్వాత మే, జూలై, సెప్టెంబరుకు వాయిదా

2023లో దసరా, క్రిస్మస్‌ అంటూ హడావుడి.. విశాఖ సదస్సులోనూ జగన్‌ ప్రకటన

అగ్రహీరోలతో భేటీలోనూ ఇదే మాట.. విశాఖలో కార్యాలయాల కేటాయింపు

రుషికొండపై రూ.450 కోట్లతో ప్యాలెస్‌.. గృహప్రవేశం చేసి.. తాడేపల్లిలో మకాం

‘మాట తప్పం.. మడమ తిప్పం’.. అంటూ జగన్‌ తరచూ చెబుతుంటారు. ఆయన్ను కీర్తిస్తూ వందిమాగధులు కూడా ఇదే డబ్బా కొడుతుంటారు. రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ సహా ఆయన పార్టీ నేతలు చేసిన ప్రకటనలు, చేసిన విన్యాసాలు పరిశీలిస్తే పైకి చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని, అమరావతే కొనసాగుతుందని గత ఎన్నికల ముందు జగన్‌ స్వయంగా హామీ ఇచ్చారు.

అయితే ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు హయాంలో శ్రీకారం చుట్టిన అమరావతి రాజధానిపై అక్కసుతో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమరావతిని నాశనం చేయడానికి కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమేనంటూ నాటకమాడారు. చివరికి మూడు ప్రాంతాల ప్రజలనూ మోసం చేశారు.

ఉత్తరాంధ్రులకు మోసం

విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని, ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని ప్రకటనలు గుప్పించిన ముఖ్యమంత్రి జగన్‌ అక్కడి ప్రజలను మోసం చేశారు. మూడేళ్లుగా ‘ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా’ అంటూ పలుమార్లు గడువు మార్చారు. చివరకు ఏమీ తేల్చకుండానే మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.

విశాఖ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి జగన్‌ సహా మంత్రులు, వైసీపీ పెద్దలు ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు. 2022లో సంక్రాంతి పండగ ముగిసిన మరుసటిరోజే విశాఖ మారియట్‌ హోటల్‌లో జరిగిన ఐటీ సదస్సులో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఉగాదికి సీఎం విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభిస్తారని ప్రకటించారు.

అలా మొదలైన డెడ్‌లైన్లు మారుతూ వచ్చాయి. మే, జూలై, సెప్టెంబరు అంటూ వాయిదా వేశారు. 2023లోనూ దసరా, ఆ తరువాత క్రిస్మస్‌ అంటూ అనేక తేదీలు ప్రకటించారు. గత ఏడాది మార్చిలో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. దానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఢిల్లీలో సీఎం జగన్‌ రోడ్‌షో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానని వెల్లడించారు. పెట్టుబడుల సదస్సులోనూ అదే చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడడానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన అగ్రశ్రేణి హీరోలు తాడేపల్లిలో జగన్‌తో భేటీ అయ్యారు. ‘త్వరలో నేను విశాఖ వెళ్లిపోతున్నాను. మీరు కూడా వస్తే జూబ్లీహిల్స్‌ వంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు, స్టూడియోల నిర్మాణానికి స్థలాలు ఇస్తా’ అని జగన్‌ ఆశ పెట్టారు.


ఆర్థిక వనరులపైనే కన్ను

ఆర్థిక, ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న సాగరతీర నగరం విశాఖపట్నంపై జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడో కన్నేశారు. ఇక్కడ పాగా వేయాలని కలగన్నారు. 2014 ఎన్నికల్లోనే తల్లి విజయలక్ష్మిని విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆమెను విశాఖ ప్రజలు ఓడించారు.

ఆ తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నా.. విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారు. అంటే.. విశాఖ ప్రజలకు వైసీపీ అన్నా, ఆ పార్టీ నాయకులన్నా ఎటువంటి అభిప్రాయం ఉందో అర్థమవుతుంది.

అమరావతిని భ్రష్టు పట్టించాలని నిర్ణయించుకున్నాక జగన్‌... విశాఖలో పరిపాలనా రాజధాని అంటూ కొత్త పాట ప్రారంభించారు. 2021 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే దీనిపై దృష్టి పెట్టారు. విశాఖలో పరిపాలనా రాజధాని ప్రారంభిస్తే ఏర్పాటు చేసే కార్యాలయాలకు అవసరమైన భవనాలు గుర్తించాలంటూ పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి అధ్యక్షతన త్రిసభ్య కమిటీని వేశారు. వాస్తవానికి అంతకు ముందే విశాఖ పరిసరాల్లో ఎక్కడెక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చేశారు. ‘మమ’ అనిపించడానికి కమిటీని విశాఖపట్నం పంపించారు.

450 కోట్లతో జగన్‌ కోసం..

రుషికొండపై ఉన్న ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి 5 స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, పర్యాటకులకు మెరుగైన వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు.

దానికి రూ.450 కోట్లు వెచ్చించారు. అక్కడ జరిగిన అనేక నిబంధనల ఉల్లంఘనలపై కోర్టులో కేసులు వేసినా.. పర్యాటకుల వసతి గృహాలనే చెప్పుకొచ్చారు. త్రిసభ్య కమిటీ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి.. ఆ భవనాల్లోనే సీఎం క్యాంపు కార్యాలయం పెడితే బాగుంటుందని సిఫారసు చేశారు.

దాంతో లైన్‌ క్లియర్‌ అయింది. సీఎం క్యాంపు కార్యాలయం కోసం రుషికొండలో ప్రత్యేకంగా భూగర్భ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కంటెయినర్‌ సబ్‌స్టేషన్‌ పెట్టారు. సీఎం అక్కడికి రాకపోకలు సాగించడానికి మధురవాడ నుంచి శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ మీదుగా రుషికొండ వరకు 3.1 కి.మీ. రహదారిని వీఎంఆర్‌డీఏ నుంచి రూ.20 కోట్లతో అభివృద్ధి చేశారు.

రుషికొండ బీచ్‌లో హెలిప్యాడ్‌ ఏర్పాటుచేశారు. శారదాపీఠం స్వామితో గృహప్రవేశం చేయించారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా జగన్‌ విశాఖలో మకాం వేయలేదు.


విశాఖకు కొత్త వర్సిటీలేవీ?

విశాఖపట్నం కేంద్రంగా కొత్త యూనివర్సిటీల ఏర్పాటు విషయంలోనూ జగన్‌ సర్కారు మాట నిలబెట్టుకోలేదు. విశాఖ కేంద్రంగా ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అందించే రీసెర్చ్‌ యూనివర్సిటీ పెడతామని నాలుగేళ్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు.

అదొక్కటే కాకుండా ఆక్వా కల్చర్‌కు ఒక యూనివర్సిటీ, స్పోర్ట్స్‌కు మరో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ వాటిలో ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు కనీసం ప్రణాళిక కూడా రూపొందించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఉత్తరాంధ్రకు కేటాయించింది. కానీ జగన్‌ ప్రభుత్వం ఎటువంటి విధానాలూ అనుసరించడం లేదు. ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంది.

కార్యాలయాలకు భవనాలు

  • త్రిసభ్య కమిటీ మొత్తం 35 శాఖల్లో 16 శాఖలకు విశాఖలో పలు భవనాలను కేటాయించింది. వాటిని ఆయా శాఖలు ఉపయోగించుకోవాలని సూచించింది. భీమిలిలోని డైట్‌ భవనాన్ని విద్యా శాఖకు, ఏయూలో పలు నూతన భవనాలనుఉన్నత విద్య కార్యాలయాల కోసం, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపాన ఏలేరు గెస్ట్‌హౌ్‌సను ఇరిగేషన్‌కు, మర్రిపాలెంలో ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌ్‌సను అదే శాఖకు, విమ్స్‌లో పలు భవనాలను వైద్య శాఖకు, రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో ఐటీ శాఖతో పాటు రెవెన్యూ అధికారులకు, పిఠాపురం కాలనీలోని వీఎంఆర్‌డీఏ భవనాన్ని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ కార్యాలయానికి కేటాయించారు.

  • అప్పుఘర్‌ వద్ద పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్‌లో 27 గదులను అధికారుల వసతికి కేటాయించారు.

  • బీచ్‌రోడ్డులోని అటవీ శాఖ గెస్ట్‌హౌస్‌, జీవీఎంసీ గెస్ట్‌హౌస్‌, కైలాసగిరి కిందన పంచాయతీరాజ్‌ అతిథిగృహం కేటాయించారు. జిల్లా పరిషత్‌ జంక్షన్‌లో కొత్తగా నిర్మించిన విల్లాలను ఉన్నతాధికారులకు ఇవ్వాలని నిర్ణయించారు.


భవనాలన్నీ ఖాళీ

  • మూడు రాజధానుల అంశం న్యాయస్థానానికి చేరింది. ఆ కేసు తేలేంత వరకు విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే అవకాశం లేదు.

  • ఈ విషయం స్పష్టంగా తెలిసినా సరే విశాఖ ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూశారు. చివరికి గడువులన్నీ ముగిశాక మరో మాట మార్చారు.

  • కోర్టులో కేసు ఓడిపోయినా, కొనసాగినా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి పనుల సమీక్ష కోసం విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం పెడతామని, ఆ పేరుతో సీఎం ఇక్కడే ఉండి పరిపాలన చేస్తారని వైసీపీ విశాఖ జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే ఏ కార్యాలయమూ ప్రారంభించలేదు.

  • రూ.450 కోట్లతో రుషికొండపై నిర్మించిన భవనం అలాగే ఉంది. రుషికొండలోనే రూ.145 కోట్లతో నిర్మించిన మిలీనియం టవర్‌ ఖాళీగానే ఉంది. పిఠాపురం కాలనీలో రూ.8 కోట్లతో నిర్మించిన వీఎంఆర్‌డీఏ భవనం ఖాళీగా ఉంది.

Updated Date - Apr 28 , 2024 | 09:28 AM

Advertising
Advertising