ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మరో నీచత్వానికి వైసీపీ శ్రీకారం.. నాగబాబు సంచలన కామెంట్స్

ABN, Publish Date - May 11 , 2024 | 03:01 PM

Andhrapradesh: వైసీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రోడ్‌ షోలో నాగబాబు మాట్లాడుతూ... మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని.. వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ డబ్బులు అందచేయడంతో పాటు.. డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్ళపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని సంచలన అంశాలు బయటపపెట్టారు.

Janasena Leader Nagababu

అమరావతి, మే 11: వైసీపీ నేతలు (YSRCP Leaders) మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు (Janasena Leader konidala Nagababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రోడ్‌ షోలో నాగబాబు మాట్లాడుతూ... మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని.. వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ డబ్బులు అందచేయడంతో పాటు.. డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్ళపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని సంచలన అంశాలు బయటపపెట్టారు. 13వ తేదీన వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారన్నారు. ప్రతిఓటరు డబ్బులు తీసుకుని ఇంట్లోనే ఉండేలా భయపడుతున్నారని అన్నారు.

AP Elections: అదనపు బస్సులు ఏర్పాటు చేయండి.. ఆర్టీసీ ఎండీకీ చంద్రబాబు లేఖ


పిఠాపురం వంటి నియోజకవర్గంలో భారీగా డబ్బులు ఇచ్చి.. వేళ్ల మీద సిరా చుక్కలు వేసేలా పన్నాగం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లినా సిరా గుర్తు చూసి అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Elections Commission) దృష్టికి తీసుకు వెళుతున్నామన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసే విధంగా అమాయక ప్రజలను వైసీపీ నేతలు మళ్లీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డబ్బులు తీసుకుంటారా లేదా అనేది వారి వ్యక్తిగతమని.. కానీ ఎవరూ కూడా సిరా చుక్కను వేస్తామంటే తిరస్కరించాలని కోరారు. ‘‘మీ మనస్సు చెప్పిన విధంగా మంచి పాలన అందించే వారికే ఓటు వేయండి’’ అని వినతి చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘మరోసారి వైసీపీ వస్తే.. ప్రజల జీవితాలు సర్వనాశనమే.. పారాహుషార్’’ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు.

LokSabha Elections: మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?


అది జగన్ ప్రచార పిచ్చికి పరాకాష్ట...

‘‘స్వామివారికి భక్తులు ఇచ్చిన ఆస్తుల్ని జగన్ అమ్మేయాలని చూశాడు. బీజేపీ -టీడీపీ- జనసేన పార్టీలు శ్రీవారి ఆస్తుల్ని కాపాడాయి. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే సొమ్ముని తమకు కావాల్సిన వారికి మళ్ళించ్చారు. కూటమి అధికారంలోకి వస్తే టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తాం. జిల్లాకు చెందిన మంత్రి రోజా 10 రోజులకు ఒకసారి 25 మందితో దర్శనానికి వెళ్లి దర్శనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతోంది. శ్రీవారి దర్శనాన్ని అమ్ముకునే వైసీపీ వాళ్లు.. స్థానికులకు శ్రీవారి దర్శనం లేకుండా చేశారు. కూటమి రాగానే స్థానికులకు దర్శనం తిరిగి అవకాశం కల్పిస్తాం. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన పట్టాలపై శ్రీవారి ఫోటో ఉండాలి గానీ జగన్ ఫోటో పెట్టుకోవడం జగన్ ప్రచార పిచ్చికి పరాకాష్ట. టీటీడీలో నందిని నెయ్యి వాడేవారు ఇప్పుడు కమిషన్ల కోసం నందిని ఆపేసి వారికి ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ను ఎగిరేశారు. శేషాచలంలోని అరుదైన ఎర్రచందనాన్ని వైసీపీ వాళ్లు దోచుకున్నారు. ఎర్రచందనం డాన్ గంగిరెడ్డికి ఎన్నికల్లో పలు సీట్లలో కూటమి అభ్యర్థులను ఓడించే బాధ్యతను అప్పగించారు. తిరుపతిలో ఏ పని జరగాలన్న కరుణాకర్ రెడ్డికి ఆయన కుమారుడు అభినయ రెడ్డికి 40% కమిషన్ ఇయాలి. కోడి బొచ్చు ద్వారా వీళ్ళిద్దరూ నేలకు 20 లక్షలు తీసుకుంటున్నారు.దేశంలోని ఇలా నీచమైన వసూలు చేసే రాజకీయ నాయకులు ఎవరూ లేరు. తులసీ వనం లాంటి తిరుపతిని గంజాయి వనల్లా మార్చేస్తున్నారు భూమన కుటుంబం. తిరుపతి గంగమ్మ జాతర కూడా వ్యాపార వ్యాపారమైంది కోట్లు వసూలు చేశారు. తిరుపతి ప్రజలను దోచిన వారికి సరైన ట్రీట్మెంట్ కచ్చితంగా ఉంటుంది’’ అని జనసేన నేత నాగబాబు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!

Elections 2024: పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 03:51 PM

Advertising
Advertising