ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: ఎన్నికల వేళ టీడీపీలో భారీగా చేరికలు

ABN, Publish Date - Apr 04 , 2024 | 12:34 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు.

విజయవాడ, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో (TDP) భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని (Kesineni Chinni) సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. యువత గత ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వం (TDP Government).. వచ్చిన వెంటనే యువతకి కావాల్సిన ఉపాధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా అధికారంలో ఉన్నా 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ ఇస్తామన్నారు. గత 10 రోజుల నుంచి పార్టీలోకి అధికంగా యువత జాయిన్ అవుతున్నారని తెలిపారు. యువత మొత్తం పార్టీ విజయం కోసం పనిచేయాలని కేశినేని చిన్ని కోరారు.

మొబైల్ ఫోన్‌తో పొన్నంకు ఇబ్బందులు!


చిన్ని విజయం ఖాయం: పట్టాభి

టీడీపీలోకి యువత జాయిన్ కావటం సంతోషంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని యువత కోరుకుంటున్నారని తెలిపారు. సైకో జగన్ పోవాలి...సైకిల్ రావాలన్నారు. యువతకి జాబ్ మేళా ఏర్పాటు చేసి యువతని ఆదుకున్నారని వెల్లడించారు. కేశినేని చిన్ని విజయం ఖాయమని పట్టాభి ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

Kotamreddy: వైసీపీ ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..

AP Pensions: ఇవాళా అదే పరిస్థితి.. ఏపీలో పెన్షన్‌దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు...


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 04 , 2024 | 11:42 PM

Advertising
Advertising