మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

ABN, Publish Date - May 15 , 2024 | 01:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై సీఈవో ముకేష్ కుమార్ మీనా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నమోదైన పోలింగ్ వివరాలతో పాటు ఆరోజున రాష్ట్రంలో..

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
AP CEO Mukesh Kumar Meena Press Meet

ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నమోదైన పోలింగ్ వివరాలతో పాటు ఆరోజున రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైందని చెప్పారు. అందునా ఈవీఎంల ద్వారా 80.59 శాతం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం మేర నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం, తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు.


మొత్తం 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని ఎంకే మీనా పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పోలింగ్ పూర్తయ్యిందన్నారు. అయితే.. అసెంబ్లీకి ఓటు వేసిన వారిలో కొందరు లోక్‌సభకు ఓటు వేయలేదని చెప్పారు. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4,560 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచామన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయని, అయితే ఈ స్థాయిలో పోలింగ్ ఎక్కడ జరగలేదని చెప్పారు. ఇక నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Updated Date - May 15 , 2024 | 02:14 PM

Advertising
Advertising